Monday 25 December 2017

ఇవ్వాళ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి?నిజానికి ఇన్ని మతాలు అవసరమా?అప్పుడు అక్బరు చేసినట్తు అన్నిటినీ కలిపి ఒకే మతాన్ని తయారు చెయ్యలేమా?

తెలుగు భాష మిక్కిలి ప్రమాదకరమైనది!కొందరు ఇది ద్రవిడ భాష అంటారు - బోల్డు సాక్ష్యాలు చూపిస్తారు.కొందరు అసలు ద్రవిడ అనేది లేనేలేదు,ఇది సంస్కృతం కన్న గొప్పది అంటారు - అందుకు బోల్డు సాక్ష్యాలు చూపిస్తారు.నాబోటి మర్యాదస్తులు రెండోదానికే ఎక్కువ మొగ్గు చూపినా మొదటి వారు నిలదీస్తే వారికీ వోటు వేస్తారు - మొండివాళ్ళతో జగడం ఎందుకు, చెప్పండి!

మతాల గురించి తలకట్టు పెట్టి భాషల గురించి వాయిస్తున్నాడేమిటా అనుకుంటున్నారు కదూ!ప్రపంచంలో ఇవ్వాళ ఎన్ని మతాలు ఉన్నాయో తీరిగ్గా లెక్కతీస్తే భాషల లాగే చాలా ఉన్నాయి.మరీ విచిత్రం ప్రతి మతానికీ ఒక భాష ఉంది!భాషకి ఏముంటాయి - అక్షరమాల, పదకోశం, వ్యాకరణం, సాహిత్యం ఉంటాయి!మతానికి కూదా దైవం, నమ్మకాలు, కర్మకాండలు, నీతులు/నియమాలు, శిక్షలు ఉంటాయి!

ఇంకా ఈ పోలికని పొడిగిస్తే, భాషల్లో మాండలికాలు ఉన్నట్టు ప్రతి మతంలోనూ మతశాఖలు ఉంటాయి.మనందరం ఏకశిలాసదృశం అనుకునే క్రైస్తవంలోనే 30,000 శాఖలు ఉన్నాయి.మనకి తెలిసిన క్యాధలిక్కు,ప్రొటెస్టెంటు మాత్రమే కాక మ్యాసన్రీ క్లబ్, ఇల్యూమినాట్టి, గార్డ్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్/టెంప్లర్, తొక్కా తోలు పేర్లతో చాలానే ఉన్నాయి.హిందువుల్లో ఉన్న 300 కులాలకే "వామ్మో,ఇన్ని కులాలా!" అని హడలగొట్టి లాక్కుంటున్నారు - అంతా మోసం!

"సరేనయ్యా, మన్లోనూ ఉన్నాయిగా జైనం, ఆజీవకం, చార్వాకం, కాపాలికం, శాక్తేయం, తోలూ తొక్కా పేర్లతో! అసలు ఇన్ని మతాలు ఎందుకు పుట్టాయి అనేదానికి జవాబు చెప్పవేం?" అని విసుక్కుంటున్నారు కదూ!దానికి జవాబు విశ్వనాధ సత్యనారాయణ గారు చెబుతారు.కల్పవృక్షం రాస్తూ ఎవరూ అడక్కపోయినా "మరల నిదేల రామాయణం"బని అడుగుతారేమో అని మనమీద ఓ నిష్ఠూరం, వేసి గుత్తి వకాయ కూరని జన్మానికల్లా ఒకసారి తినేసి సరిపెట్టెయ్యడం లేదు గదా,మా తాత తిన్నాడు లెమ్మని మనం తినకుండా ఉండటం లేదు గదా అని రీజనింగు లాగి సమర్ధించుకున్నారు - అసలాయన అంత సుత్తి వెయ్యనక్కర్లేదు, ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు చాలా తక్కువమందే!పుస్తకం ఎవరూ చదవకపోయినా ఈ పాయింటు మాత్రం బాగా పాప్యులర్ అయ్యింది - దాన్సిగదరగ అసలు కన్న కొసరు ముద్దంటే ఇదే గావాఁల!

జిహ్వకో రుచీ పుర్రెకో బుద్ధీ అన్నారు గదండీ పెద్దలు - దానికి తోడు నలుగురూ నడిచే దారిలో నేనెందుకు నడవాలి,నాకంటూ వేరే దారి నేనే వేసుకుంటాను,నా దారిలో నేనే నడుస్తాను,ఏ కొంచెం గిట్టుబాటయ్యే చాన్సున్నా ఇదిగిదిగో అల్లాండం బెల్లాండం నాదారి బెమ్మాండం అంజెప్పి అందర్నీ నా ఎనక్కాల నడిపించుకుంటాను,అప్పుడే నాకు తుత్తి అనే తింగరోళ్ళు కనిపెట్టారు ఇన్ని మతాల్ని.ఎవర్నీ ఆపలేం,గట్టిగా ఆపుదామంటే అప్పటికే తన చుట్టూ పోగయిన జనాన్ని చూపించి "వీళ్ళంతా మూర్ఖులు అనుకుంటున్నావా?" అని మెలిక పెడితే వాళ్ళకి రోషమొచ్చి మనల్ని తంతారే తప్ప తాము మూర్ఖులమనీ తాము నమ్మేవాడు మోసగాడనీ చచ్చినా ఒప్పుకోరు - మొండివాళ్ళతో జగడం ఎందుకు, చెప్పండి!

A నుంచి Z వరకు ఉన్న వాటిల్లో ఒక్కదాన్ని కూడా వదలకుండా అన్నిటినీ కలిపి లెక్కతీస్తే తెలిసీ తెలియనట్టూ ఇదివరకెప్పుడో విన్నట్టూ ఉన్న  మతాలే 80 పైన తేల్తున్నాయి.వీటిల్లో ఒక్కలాగే అనిపించే Agnosticism, atheism అనేవి రెండూ వేరువేరుట - నాకిప్పుడే తెలిసింది!అన్నిటి గురించీ యెత్తుకుంటే మీరు మళ్ళీ నా బ్లాగుకి రారు,కాబట్టి ఒక పదింటిని గురించి మాత్రం టూకీగా పరిచయం చేస్తాను.

1. క్రైస్తవం [అబ్రహామిక, 27 AD] 2.1 బిలియన్ విశ్వాసులు
బైబిలు పాత నిబంధన,కొత్త నిబంధన అని రెండు భాగాలుగా ఉండి విశ్వాసులు తమ అనుష్ఠానం కోసం దానిని అనుసరిస్తూ జీసస్ దైవపుత్రుడు అని నమ్మడమే ఈ మతం యొక్క ముఖ్యలక్షణం అని చెప్పవచ్చు,అయితే ఇక్కడా త్రిత్వవాదం ఉంది కాబట్టి ఇది పూర్తి ఏకేశ్వరోపాసనని పాటించే మతం కాదనే విమర్శ కూడా ఉంది.ప్రపంచం లోని పాపులను అందర్నీ ఉద్ధరించడానికి జీసస్ శిలువ మీద చేసిన బలిదానం,పునరుత్ధానం అనే విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు - ఆ మతానికి సంబంధించిన సమస్తమయిన ఆలోచనల్నీ క్రీస్తు శిలువ వెయ్యబడటం అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుంది!

ప్రొటెస్టెంటులు విశ్వాసం ఒక్కటే తరణం అని నమ్మితే క్యాధలికులూ సంప్రదాయక వర్గాల వారూ విశ్వాసంతో పాటు సత్ప్రవర్తన కూడా ముఖ్యమని భావిస్తారు.కొత్త నిబంధన ఇద్దరికీ ఒకటే గానీ మార్టిన్ లూధర్ ప్రొటెస్టెంటు సంస్కరణలు తెచ్చేటప్పుడు పాత నిబంధన నుంచి ఏడు పుస్తకాల్ని తీసేశాడు - మరీ చెతగా ఉన్నాయని.అతను కొత్త నిబంధన నుంచి కూడా నాలుగు పుస్తకాలు తీసేసినా వాటి మీద వ్యామోహం పోక మళ్ళీ  చేర్చుకున్నారు.

క్రైస్తవుల్లో క్యాధలికులు మనలో బ్రాహ్మల్లాగే చాదస్తులు - Baptism, Confirmation, Holy Communion, Confession, Last Rites, Holy Orders, and Matrimony అనే ఏడు కర్మకాండల్ని తుచ తప్పకుండా పాటిస్తారు.ప్రొటెస్టెంటులు మనలో ఇతర కులాల వాళ్ళలా కాస్త బద్ధకస్తులు - Baptism, Holy Communion అనే రెంటిని మాత్రం పాటిస్తారు.మిగిలినవాళ్ళు అవీ చెయ్యరు!

ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్లో క్యాధలిక్కులే పెద్ద సమూహం - 1 బిలియను మంది వీళ్ళే!క్రీ.శ 11వ శతాబ్దంలో ఆర్ధడాక్స్ చర్చ్,క్యాధలిక్ చర్చ్ అంటూ వచ్చిన చీలికా క్రీ.శ 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్  సంస్కరణా అనే రెండు పెద్ద కుదుపులు తప్పించితే మిగిలిన చరిత్ర అంతా ప్రశాంతంగానే గడిచింది అంతర్గత వైరుధ్యాలు లేకుండా.
ఎలాగూ జీసస్ క్రీస్తు దైవపుత్రుడు కాబట్టి దేవుడే అతన్ని పంపించాడు గనక బైబిలు దైవవాక్యం అని నమ్ముతారు.ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిలుకి విరుద్ధంగా నడవటానికి ఇష్టపడరు.క్రైస్తవుల విజయాల వెనక ఉన్న మూడు రహస్యాలు నమ్మకం,నమ్మకం,నమ్మకం!జీసస్ పదే పదే నమ్మబలికిన "I am the light of the world; he who follows me will not walk in darkness, but will have the light of life." అనే మాటల్ని కళ్ళు మూసుకుని నమ్మారు,నమ్ముతున్నారు,నమ్ముతారు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో జిత్తులమారి తనాన్ని ప్రదర్శిస్తూ అధికారాన్నీ సంపదనీ కోరుకునే రాజ్యతత్వం ఎక్కువ.

2. ఇస్లాం [అబ్రహామిక, 610 AD] 1.3 బిలియన్ విశ్వాసులు
ఇస్లాం అనే మాటకు అరబీక్ భాషలో విధేయత అని అర్ధం వస్తుంది - చాలామంది పొరబడుతున్నట్టు ఈ మతానికీ శాంతికీ ఎలాంటి సంబంధమూ లేదు,విధేయత వల్ల శాంతి వస్తుంది అని అర్ధం చేసుకోవాలి!ఇతరులకి విధేయతను అలవాటు చెయ్యడానికి వీరు అవిశ్వాసుల మీద ప్రకటించిన యుద్ధమే జిహాద్.

ఈ మతానికి సంబంధించిన సమస్తమూ క్రీ.శ 7వ శతాబ్దిలో పుట్టిన మహమ్మదు అనే వ్యక్తి దేవుడు తనకి బోధించాడని చెప్పిన ఖురాన్ మరియు సున్నత్ నుంచి తీసుకుంటారు,ఈ మతస్థులు మహమ్మదు వేరే ఒక కొత్త మతాన్ని స్థాపించాడంటే ఒప్పుకోరు.అబ్రహాము, మోజెస్, జీసస్ వంటివారిని కూడా ప్రవక్తలని ఒప్పుకుంటూనే వాటిలోని తప్పుల్ని సరి చేయ్యడానికి దేవుడు పంపించిన మహమ్మదు వీరందరి తర్వాత వచ్చిన ఆఖరి ప్రవక్త అని చెబుతారు.అంటే,జుదాయిస్టులూ క్రైస్తవులూ అసలు దేవుడు చెప్పీనదానిని మార్చేశారనీ ఇప్పుడు అలాంటి మార్పులు చెయ్యడానికి వీల్లేని పద్ధతిలో మహమ్మదుని ఆఖరి ప్రవక్తగా దేవుడే పంపించి ఇంక కొత్త ప్రవక్తలని పంపించనని అన్నాడనీ అర్ధం.

అందువల్ల ముస్లిములు ఏ విధమైన సందేహాలూ లేకుండా తమ మతమే సర్వోన్నతమైనదని నమ్ముతూ ఇతర మతాలు తమ మతం కన్న నీచమైనవనే దృష్టితో ఉంటారు.ఈ భావన కేవలం వాచ్యమైనది కాదు - ఖురాన్-సున్నత్-హాడిత్ త్రయంలోని ముఖ్య సూత్రాల ప్రకారమే ముస్లిములు తమ కూతుళ్ళని ముస్లిమేతరులకి ఉద్వాహం చెయ్యకూడదు, ముస్లిమేతరులకి తమ ముస్లిం బంధువుల నుంచి వారసత్వపు హక్కులు ఇవ్వకూడదు, ముస్లిమేతరుడు ముస్లిము మీద చేసిన నేరారోపణను గానీ నేరసంబంధసాక్ష్యమును గానీ నమ్మకూడదు, ఇస్లాముని గానీ ముస్లిములని గానీ దూషించిన ముస్లిమేతరులని బ్రతకనివ్వకూడదు అని స్పష్టమైన నిర్వచనాలతో, హెచ్చరికలతో, మార్గదర్శకాలతో కూడిన ముస్లిం-కాఫిర్ విభజన ఉన్నది.
క్రీ.శ 610 నుంచి క్రీ.శ 632 మధ్యన మహమ్మదు ముఖతః వెలువడిన ఖురాను ఒక్కటే ప్రపంచ మానవాళికి సర్వకాల సర్వావస్థలలోనూ పాటించదగిన సర్వోత్తమశాసనం అన్న నమ్మకమే ముస్లిములని ఉత్తేజితుల్ని చేస్తున్నది.విగ్రహారాధనని మక్కా యాత్రకి మాత్రం పరిమితం చెయ్యడం వల్ల దేవుడికి చెయ్యాల్సిన నిత్యపూజలూ, క్రతువులూ, కర్మకాండలూ ఏమీ అవసరం లేదు.రోజుకి 5 సార్లు ప్రార్ధన చేస్తే చాలు. నైతికపరమైన నిషేధాలు చాలా తక్కువ, కాఫిర్లు అని పేరు పెట్టిన ఇతరుల్ని మోసం చెయ్యడం కూడా అనుమతించబడింది.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అధికారాన్నీ సంపదనీ కోరుకునేసైనికతత్వం ఎక్కువ.

3. హిందూమతం [ధార్మిక, 1500 BC] 1 బిలియన్ విశ్వాసులు
హిందూమతానికి ఒక ప్రవక్త అంటూ ఎవరూ లేరు.ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికీ తెలియదు.ఇప్పుడు బతికి ఉన్న మొత్తం 80 పైన ఉన్న మతాల్లో అత్యంత ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న మతం ఇది ఒక్కటే!హిందూమతానికి ఒకటి కాదు, అనేకమైన గ్రంధాలు ఉన్నాయి - అన్నీ సమానమైన స్థాయి గలవే!ఇవన్నీ జ్ఞానోపాసన పట్ల శ్రద్ధ గలిగి ఉండి ప్రయత్నించిన ఋషుల యొక్క ఆధ్యాత్మిక యోగ్యతని బట్టి దైవం కరుణించి తెలియజెప్పిన వైదిక సాహిత్యం మీద ఆధారపడి ఉంటాయి.కొన్ని వేదప్రామాణ్యాన్ని అంగీకరించని శాఖలు కూడా ఉన్నాయి.అన్నింటినీ కలిపి సనాతనధర్మం అని కూడా పిలుస్తారు.నిజానికి ఈ సంప్రదాయానికి  హిందూమతం అని పేరు పెట్టి దీన్ని పాటించేవారిని హిందువులు అని ఇతరులు వ్యవహరించకముందు వారిని గురించి వారు చెప్పుకున్నదీ ఇతరులు గుర్తించినదీ సనాతనధర్మం పేరుతోనే.

వైదిక సాహిత్యంలో కేవలం దైవం గురించే కాక ఇతరమైన నైతిక, సామాజిక, సైనిక, సాంకేతిక విషయాలను కవితాత్మకమైన శైలిలో వర్ణించడం జరిగింది.మొత్తం సాహిత్యంలోని స్థూలమైన సూత్రాలలో ధార్మిక ప్రవర్తన, సంసార చక్ర గమనం, కర్మ యోగం లోని కార్యకారణ సంబంధం, సాంసారిక చక్రం లోని వ్యామోహాల నుండి విడివడే మోక్షప్రాప్తి, మోక్షప్రాప్తికి శరీరాన్నీ మనస్సునీ సిద్ధం చెయ్యటానికి అవసరమైన యోగ సాధనా ప్రక్రియలు అనేవి ముఖ్యమైనవి.

సనాతన ధార్మిక సాహిత్యం ప్రకారం దైవం పట్ల ఉండాల్సిన దృష్టికోణం విషయంలో కొంత సంక్లిష్టత ఉంటుంది,ఏకేశ్వరోపాసన, బహుళదేవతారాధన, ఒక దేవతాస్వరూపాన్ని ప్రముఖ దైవంగా పూజిస్తూ ఇతర దైవాలను కూడా పూజించటం, అసలు దైవం యొక్క ఉనికినే తిరస్కరించటం - అన్నీ హిందూమతంలో సమ్మతమైన విషయాలే!
ఇతరులకి హిందువులు బహుళాదేవతారాధన చేస్తున్నట్టు అనిపించినప్పటికీ అవన్నీ ఒకే ఒక నిరాకార పరబ్రహ్మానికి వ్యక్తరూపాలుగా భావించడం వల్ల వారిలో వారికి గందరగోళం లేదు.హిందువులకు ఆలయాలలోని అర్చామూర్తులలోనే కాదు - నదులు, చెట్లు, జంతువులు వంటి అన్నిటిలోనూ దేవుడు కనిపిస్తాడు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో ఉదాసీనతని ప్రదర్శిస్తూ అధికారాన్నీ సంపదనీ తిరస్కరించే ముముక్షుత్వం ఎక్కువ.

4. బౌద్ధమతం [ధార్మిక, 600 BC] 376 మిలియన్ విశ్వాసులు
ఈ మతాన్ని బుద్ధ ధర్మం లేదా ధమ్మం అని కూడా పిలుస్తారు.క్రీ,పొ 5వ శతాబ్దికి చెందిన సిద్ధార్ధ గౌతముడు వేసిన ధర్మచక్రప్రవర్తన అనే ప్రణాళికని అమలుచెయ్యటమే ఈ మతానుయాయుల కర్తవ్యం.బుద్ధుడు అంటే వికసించిన ఆత్మ కలవాడు అని అర్ధం,అందుకే ఈ మతచిహ్నంలో కూడా వికసించిన పద్మం ఉంటుంది.వీరి నమస్కారం కూడా "ఓం మణిపద్మోహం!" అని ఉంటుంది.ఈ మతానికి సంబంధించి బయటివారికి తెలిసినది గౌతమ బుద్ధుడు ఒక్కడే,కానీ వారి నమ్మకాల ప్రకారం అజ్ఞానమనే నిద్రనుండి పూర్తి మెలకువను సాధించిన ప్రతి మనిషీ బుద్ధుడే అవుతాడు.ప్రస్తుతం శాక్యముని అని పిలిచే గౌతమ బుద్ధుని కన్న ముందు సైతం బుద్ధులు ఉన్నారు, ఇక ముందు కూడా వస్తారు.

ఇందులోనూ మహాయనం, హీనయానం, వజ్రయానం, ధేరవాదం లాంటి శాఖలు ఉన్నాయి,కానీ అందరూ పాటించే మౌలిక సూత్రాలు ఇవి: 1.గౌతమ బుద్ధుని ఆధిక్యాన్ని అంగీకరించడం, 2.అతను సూచించిన అష్టాంగ మార్గాన్ని అనుసరించడం, 3.రెండు పరస్పర విరుద్ధమైన మార్గాలకు సంబంధించిన సంఘర్షణ వచ్చినప్పుడు మధ్యేమార్గాన్ని అనుసరించడం - వీటిని అందరూ పాటిస్తారు.

బౌద్ధులు దేవుని అస్తిత్వాన్ని అంగీకరించరు.బయటివారికి ఎత్తైన బుద్ధ ప్రతిమలను చూసి అపోహ కలుగుతుంది గానీ ఆ విగ్రహాల పట్ల వారికి ఆప్యాయత ఉన్నదని చెప్పడం కష్టం.ఇస్లామీయులు బమియన్ బుద్ధ విగ్రహాలను కూల్చినప్పుడు బౌద్ధ మతస్థుల కన్న ఇతరులు ఎక్కువ స్పందించడం విశేషం!

బౌద్ధులు చేసే ధ్యానం దైవం గురించి కాదు,తమ ఆత్మను జాగృతం చెయ్యడం కోసం చేసే ప్రయత్నం.తాంత్రిక బౌద్ధంలో కూడా మానసిక శక్తులను జాగృతం చెయ్యడమే కనిపిస్తుంది.సమస్యలను పరిష్కరించుకోవడానికి ధ్యానం,తర్కం అనే రెండు ఉపాయాలను పాటించే వీరిని వాదనలో ఎవరూ గెలవలేరు - కమ్యునిష్టులతో సహా! హేతువుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ మతంలో.
మోహం వల్ల,ఆశ వల్ల ప్రతి మనిషికీ, అంటే అతనిలోని ఆత్మకు ఒక కార్యకారణశృంఖల ఏర్పడుతుందనీ అది తనను తను తెలుసుకుని బుద్ధత్వం పొందేవరకు జన్మపరంపరకు కారణమవుతుందనీ ఈ శృంఖలను తెగాగొట్టగలిగిన నిర్వాణమే సాధకుడి అంతిమలక్ష్యమనీ వారు భావిస్తారు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవటంలో నిరాసక్తతని ప్రదర్శిస్తూ అధికారాన్నీ సంపదనీ నిర్లక్ష్యం చెయ్యని మధ్యేమార్గం ఎక్కువ.

5. శిఖ్ఖుమతం [ధార్మిక, 1469 AD] 23 మిలియన్ విశ్వాసులు
క్రీ.శ 1469 నుంచి క్రీ.శ 1539 మధ్య జీవించిన గురు నానక్ స్థాపించినప్పటికీ క్రీ.శ 17వ శతాబ్దం వరకు కొనసాగిన గురుపరంపరలోని పదిమందిలో ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవనీయత ఉంటుంది - గురువుని కాక గురువాణిని పూజించే ప్రత్యేకమైన మతం ఇదొక్కటే!ఈ మత స్థాపన లోనే ఒక ప్రత్యేకత ఉంది - హిందువులు ఇస్లామిక్ దాడి నుంచి రక్షించుకోవడానికి హిందూమతం నుండి వేరుపడి ఇస్లాములోని సైనికతత్వాన్నే స్వీకరించి ఏర్పడిన మతశాఖ ఇది.

ఆచార వ్యవహారాలలో హిందువుల భక్తిమార్గం ముస్లిముల సూఫీ తత్వం కలిసిన పద్ధతుల్ని పాటిస్తారు.ఒకే ఒక దైవాన్ని ప్రార్ధిస్తారు కాబట్టి ఏకేశ్వరోపాసన అనుకోవడమే తప్ప వీరికి దైవంతో అవసరం పెద్దగా లేదు.కర్తార్ అని వ్యవహరించడమే తప్ప ఆ దైవాన్ని కీర్తించడం,ఆ దైవానికి పూజలు చెయ్యడం తక్కువ.అయితే, హిందూమతంలోని బహుళదేవతారాధన పట్ల విముఖత లేదు.

ఒక చారిత్రకావసరం కోసం సైనికతత్వంతో ప్రభవించి అవసరం తీరగానే శాంతియుత జీవనానికి మరలడం ప్రపంచచరిత్రలో శిఖ్కులకి మాత్రమే సాధ్యమైంది.ఒక లక్ష్యం కోసం ప్రాణం తృణప్రాయం అని భావించి ముందుకురకడంలో శిఖ్ఖులని మించినవారు లేరు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడం పట్ల నిరాసక్తత ఉండి అధికారాన్నీ సంపదనీ అనుభవించడంలో భోళాతనం ఎక్కువ.

6. యూదుమతం [అబ్రహామిక, 1300 BC] 14 మిలియన్ విశ్వాసులు
హిందూమతం తర్వాత అబ్రహామిక మతాలలో ఇప్పుడు చెప్పుకోదగిన సంఖ్యలో విశ్వాసులు ఉండి ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నది జుదాయిజం అని పిలిచే యూదుల మతం.తమని తాము కొత్త మతాలని చెప్పుకున్న క్రైస్తవం,ఇస్లాం కూడా ఎక్కువ శాతం విషయాన్ని దీనినుంచే సంగ్రహించాయి - తులనాత్మకమైన అధ్యయనం చేసిన పరిశోధకులు వాటిని అబ్రహామిక మతాలని వ్యవహరిస్తున్నది కూడా అందుకే!

యూదుమతంలో కర్మకాండలు,ఆచారాల పట్ల పట్టింపు చాలా తక్కువ.ఈ మతం చరిత్ర కూడా అబ్రహాముకీ దేవునికీ ఏర్పడిన ఒక ఒడంబడిక(Covenant) నుంచి మొదలవుతుంది.అది కేవలం మానవుడు తన క్షేమం కోసం  దేవుడితో చేసుకున్న ఒడంబడికయే తప్ప దేవుడి నుంచి ఏకపక్షంగా వెలువడిన దైవాజ్ఞ కాదు గాబట్టి వాటిని పాటించి తీరాలన్న నియమం ఏదీ యూదులలో లేదు.అయితే, రబ్బీలు అనే పండిత సమూహం తమకు పెద్దల నుంచి సంక్రమించిన Bible (Tanakh) and the Talmud (Rabbinical discussions on ethics, customs, and law) వంటి వాటిమీద పట్టు సాధించి ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు.

యూదులు కూడా హిందువుల లాగే కాలాన్ని బట్టి సంప్రదాయాలను మార్చుకుంటూ మంచిని కొనసాగించుతూ చెడుని తొలగించుకుంటూ వస్తున్నారు.యూదులు సర్వవ్యాపి, సర్వశక్తుడు, దయామయుడు, అగోచరుడు అయిన ఒకే దైవాన్ని విశ్వసిస్తారు.హిందూమతంలోని బ్రాహ్మణుల/పూజారుల వలెనే రబ్బీలలో కూడా వంశపారంపర్యమైన మతవిద్య మీద అధికారం ఉంటుంది - వారికి యూదులలో గౌరవాదరాలు కూడా ఎక్కువే!

క్రైస్తవులు వెళ్ళగొట్టక ముందు జెరూసలేం నగరంలో సాల్మన్ కట్టించినట్లు చెప్పబడుతున్న వీరి ప్రధాన ఆలయం ఉండేది.ఆధునిక యుగంలో జరిగిన చాలా యుద్ధాలు జరగటానికి మూలకారణాలను పరిశోధిస్తే యూదులు,క్రైస్తవులు,ముస్లిములు జెరూసలేం నగరాన్ని తమకు మాత్రమే దఖలు పర్చుకోవాలనే పంతంతో ఉండడం కనిపిస్తుంది.న్యాయమైన హక్కు వారిదే అయినా సంఖ్యాబలం చాలక యూదులు వెనకి తగ్గారు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవదంలో ఉత్సుకత ఉన్నప్పటికీ అధికారాన్నీ సంపదనీ అనుభవించడంలోనూ తిరస్కరించడంలోనూ స్వాభిమానం ఎక్కువ.

7. బహాయిమతం [అబ్రహామిక, 1900 AD] 7 మిలియన్ విశ్వాసులు
మహమ్మదు గారు తనే ఆఖరి ప్రవక్తనని చెప్పుకున్న 1200 సంవత్సరాల తర్వాత అతని కంటె ఘనుడు ఆచహంత అమల్లనన్ అన్నట్టు Mirza Husayn Ali (1817-1892) స్థాపించిన అబ్రహామిక ఇస్లామీయ మతశాఖ ఇది.ఇతని విశ్వాసులు ఇతన్ని Baha’ullah అని సంబోధిస్తారు.ఇతను తన గురించి మహమ్మదు వారసుడే అయిన Bab అనే వ్యక్తి చేత ప్రకటించబడిన అసలైన ప్రవక్తను తనే అని నమ్మాడు.అందుకనే మొదట్లో ఈ మతాన్ని Babism అని పిలిచేవాళ్ళు.జీవితకాలం చాలామటుకు దేశాంతర,కారాగార శిక్షలలోనే గడిపాడు,పాలస్తీనా కారాగారంలో మరణించాడు - చూస్తుంటే చచ్చాక తన పేరు మీద జరగబోయే ఘనకార్యాల మీద పేరాశతో సుఖపడే కాలాన్ని కష్టాల పాలు చేసుకునే పిచ్చితనం ఆ పిచ్చి ఎక్కినవాళ్ళకి చాలా మత్తుని ఇస్తుంది కాబోలు!

మహమ్మదు గారి లాగే ఆదాము,అందరు యూదు ప్రవక్తలు,జీసస్ క్రీస్తు,మహమ్మదు వంటి ముందరి ప్రవక్తలను గౌరవిస్తున్నాను అంటూనే తనని ఆఖర్న పెట్టేసుకున్నాడు Baha’ullah గారు!ముందే చెప్పుకున్నట్టు ఈ మతశాఖ షియా ఇస్లాము నుంచి చీలినది కాబట్టి దాదాపు మతనిర్మితి అంతా ఇస్లాము లాగానే ఉంటుంది - Kitab al-Aqdas (The Most Holy Book) కూడా ఉంది.

అయితే, ఇస్లాం అంత క్రూరంగా ముస్లిం - కాఫిర్ విభజన లేదు,అన్ని మతాలూ మంచినే బోధిస్తున్నాయి అని నమ్ముతూ ప్రపంచ శాంతి,స్త్రీపురుష సమానత్వం,జాతుల మధ్య సహకారం, శాంతియుత సహజీవనం వంటి వాటిని గురించి నొక్కి చెబుతుంది.దేవుడు అగోచరుడని ఒప్పుకుంటూనే సృష్టిలో అంతటా ఉంటాడనీ ప్రవక్తలలోనూ వ్యక్తం అవుతూ ఉంటాడనీ చెబుతుంది బహాయిమతం.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో ఉదాసీనత ఉండి అధికారాన్నీ సంపదనీ కోరుకోవడంలో నిర్లిప్తత కనిపిస్తుంది.

8. కన్‌ఫ్యూషియనుమతం [టావోయిక, 600 BC] 6.4 మిలియన్ విశ్వాసులు
ఈ మతంలోని సమస్తమైన భావాలూ Confucius అనే సన్యాసి బోధనల మీద ఆధారపడినవి.అతని పేరు మీదనే ఈ మతం ప్రచారంలో ఉన్నది.కానీ ఇవేవీ దైవాజ్ఞ వలె గానీ హఠాత్ సంసర్గం వలె గానీ ఉబికి వచ్చినట్లు గాక అతని జ్ఞానమూ అనుభవమూ కలిపి కూర్చిన నైతిక నియమావళి అని వారే చెప్పుకుంటారు.సాంస్కృతిక విప్లవ సమయంలో కమ్యునిష్టులు ధ్వంసం చేసేవరకు అంటే క్రీ.శ 20వ శతాబ్దం వరకు చైనీయుల జీవితగమనం మొత్తం ఈ మతం ప్రకారమే గడిచింది.

ఆదిమ తెగల మధ్య యుద్ధాలు జరిగే కాలంలో వారిమధ్య ద్వేషాలను తగించడంలో ప్రముఖ పాత్రను పోషించింది.అతి తక్కువ కాలం పరిపాలించిన Qin రాజవంశపు కాలంలో ఆజ్ఞాతంగా ఉన్నప్పటికీ Han వంశీయుదైన Wu చక్రవరి తన పరిపాలనలో అధికారీక మతం హోదా ఇచ్చి సత్కరించడంతో మళ్ళీ ప్రాభవాన్ని పెంచుకుని సుదీర్ఘకాలం పాటు చైనీయుల జీవితాలని ప్రభావితం చేసింది.

Confucius సృష్టించిన అపారమైన ధార్మిక సాహిత్యంలో Ching(a series of divinations), కవితాత్మకమైన సూక్తులు, కర్మకాండలకు సంబంధించిన విధి విధానాలు చాలా ఉన్నాయి.చైనీయులు ఇప్పటికీ అతిధి మర్యాదల విషయంలో పట్టుదల చూపించటానికి ఇతని బోధనలే కారణం.ఇతని దృష్టిలో మనిషి పరిపూర్ణుడు కావాలంటే అతనిలో saint, scholar, gentleman అనే మూడు రూపాలు ఉండి తీరాలి.

ఇతర మతాలు సంక్లిష్టం చేసిన అన్ని విషయాలనీ ఇతను సరళతరం చేసి బోధించడం చాలా గొప్ప విషయం!ఆరాధనలు దేవునికి గాక గతించిన తమ పితృదేవతలను ఉద్దేశించి చెయ్యడం జరుగుతుంది.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో చురుకుదనం తక్కువగా ఉండి అధికారాన్నీ సంపదనీ అనుభవించదంలో ఆసక్తి ఎక్కువ.

9. జైనమతం [ధార్మిక, 600 BC] 4.2 మిలియన్ విశ్వాసులు
సనాతన ధర్మం తర్వాత భారత ఉపఖండంలో అత్యంత ప్రాచీన కాలం నుండి తనదైన ఉనికిని చాటుకుంటూ వస్తున్నది జైనమతం.ఇప్పటి మతరూపం జినుడు అని పిలుస్తున్న మహావెరుడు నిర్మించినది అయినప్పటికీ జైనులు అతను తమ మతానికి మూలపురుషులైన 24 మంది తీర్ధంకరులలో ఆఖరివాడని చెబుతారు.ఈ తీర్ధంకరుల బోధనలు ప్రాపంచిక సుఖాలను తిరస్కరించి జితేంద్రియత్వాన్ని ఉగ్గడిస్తూ ఉంటాయి.ఈ మతస్థులలో దేవునికి అసలు ప్రాధాన్యత లేదు,కఠోరమైన జితేంద్రియత్వమే జన్మపరంపర నుండి విముక్తికి మార్గం అని నమ్ముతారు.

వీరి అహింస ఎంతటి తీవ్రమైన స్థాయిలో ఉంటుందంటే,తమ ఉచ్చ్వాస నిశ్వాసల రాపిడికి సూక్ష్మజీవులు చనిపోకుండా ముఖానికి ముక్కునూ నోటినీ మూసివేస్తూ ఒక తెల్లని వస్త్రం కప్పుకుంటారు!వీరి మతానికి సంబంధించిన బోధనల్ని ఆగమాలు అంటారు.తొలినాళ్లలో చాలా ఉండేవి గానీ ప్రస్తుతం 45 మాత్రమే ఉన్నాయి.అవన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నప్పటికీ వాటిని అధ్యయనం చెయ్యదం,విశ్లేషించి అర్ధాలు చెప్పడం,ఇతరులకు బోధించడం మీద కొందరు జైన సన్యాసులకు మాత్రమే అధికారం ఉండేది.క్రీ.శ 5వ శతాబ్దంలోనే ఇవి గ్రంధరూపంలోనికి వచ్చాయి.అప్పటివరకు ధారణ ద్వారానే వ్యవహారం నడిచేది.

వీరిలో శ్వేతాంబరులు,దిగంబరులు అని రెండు శాఖల వారు ఉన్నారు.శ్వేతాంబరుల కన్న దిగంబరుల నిష్ఠ మరీ తీవ్రమైనది.వారిలో పురుష సన్యాసులు అసలు దుస్తులే ధరించరు.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యను పెంచుకోవదంలో నిరాసక్తత ఉండి అధికారాన్నీ సంపదనీ తిరస్కరించడం ఎక్కువ.

10. షింటోమతం [టావోయిక, 300 BC] 4 మిలియన్ విశ్వాసులు
ఇది జపాన్ దేశంలో బౌద్ధమతానికీ చైనీయుల సంస్కృతికీ జరిగిన సాంకర్యంతో క్రమేణా ఒక ప్రత్యేకమైన రూపం దాల్చిన మతం.సర్వశక్తివంతుదైన ఏకేశ్వరుణ్ణి నిస్సంకోచంగా తిరస్కరించి బహుళదేవతారాధనని మొహమాటం లేకుండా పాటించే ఏకైక మతం ఇదే!ఈ మతం kami పేరుతో ప్రాకృతిక శక్తుల ప్రతిరూపాలుగా వర్ణించబడే అనేక దైవమూర్తులను కొలుస్తారు.చెట్లు, జంతువులు, పర్వతాలు, జలపాతాలు అన్నీ దేవతాంశలే - వీరికి చేసే పూజలు కూడా తాంత్రిక పద్ధతులను తలపిస్తాయి.

షింటో ఆరాధనలో సంగీతం, నృత్యం అనే రెంటికీ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.పూజారి వర్గానికి షింటో మతస్థులు ప్రత్యేకతని ఇచ్చారు - కొన్ని ప్రాంతాలలో Shaman అని పిలిచే మహిళలు భక్త్యావేశానికి లోనై దైవవాణిని వినిపించడం కూడా కనిపిస్తుంది.ఈ మతం రూపు దిద్దుకున్నది బౌద్ధమతం నుంచి అని చెబుతున్నపటికీ దేవతామూర్తులూ ఆరాధనా పద్ధతులూ హిందూమతాన్ని పోలి ఉండటం విశేషం!

ఈ మతానికి ఒక ప్రవక్త అంటూ ఎవరూ లేరు,ఒక గ్రంధం కూడా లేదు.ఉన్నదల్లా ఈ దేవతల చుట్టూ అల్లిన పౌరాణిక సాహిత్యమే.క్రీ.శ 8వ శతాబ్దిలో వీటిని Kojiki(“Records of Ancient Matters”) పేరుతో సంక;ఇంచి గ్రంధస్థం చేశారు.ఇది క్రీ.శ 712 నాటికి పూర్తయితే క్రీ.శ 720 నాటికి పూర్తయిన Nihon Shoki(“Chronicles of Japan”) జపాన్ సంస్కృతిపైన ముఖ్యంగా రాజవంశాల మీద విపరీతమైన ప్రభావం చూపించింది.విహంగదృష్టితో చూస్తే మతస్వభావంలో సంఖ్యని పెంచుకోవడంలో నిర్లిప్తత ఉండి అధికారాన్నీ సంపదనీ ఆశించడంలో భోగలాలసత ఎక్కువ.

ప్రతి మతమూ మాదే సర్వోత్తమమైన మతం అని చెబుతున్నాయి,అయినా కొత్త మతాలు పుడుతూనే ఉన్నాయి!పుడితే పుట్టాయి,నచ్చినవాళు పాటిస్తారు లెమ్మని తమ మతం యొక్క మంచిని చెప్పుకుని ఎదగటం బదులు ఇతర మతాల్ని చెత్తవని తిట్టి తమ మతాన్ని గొప్పదని పొగుడుకోవటం వల్లనే పాటించేవాళ్ళకి ప్రశాంతతని ఇవ్వాల్సిన మతాలు అశాంతిని తెస్తున్నాయి.

1.Bahai is heavily persecuted in Iran, especially since the Iranian revolution during which many Bahá'ís were executed9. Despite being only a small world religion, Barrett & Johnson have calculated that one million Bahá'í's have been killed because of their religion.

2.Christianity has had a very troubled past when it comes to violence and extremism1, Problems with tolerance of other religions and beliefs began from its very inception within the Roman Empire, and to the extent that Christianity has insisted over the centuries that its way is the only true way, it has developed a militancy and a tendency toward fundamentalism.

3.Polytheistic religions such as Hinduism are naturally more inclusive towards others' beliefs and practices and this bears out in international statistics, and is an argument seized upon by Hindus to argue that their religion does not have a problem with extremism. But over the last few decades Hindu revivalism in India has shown fundamentalist tendencies. Some among India's Hindu nationalist reformers have also insisted on the need to establish a nation-state grounded on Hindutva, or 'Hinduness', presented as the authentic culture of the majority.Hindu nationalists have at times taken violent action against Muslims and Christian missionaries, in defiance of official state policies.

4.Militant Islam is rife in the modern world. Islamic terrorism is a constant threat to worldwide international stability2, and a string of historical (and ongoing) movements have resulted in uncountable deaths, mostly of innocent victims. Religious persecution is very much worse in Muslim-majority countries; sixty-two percent of Muslim-majority countries have moderate to high levels of persecution and of the 14 worst countries for religious persecution and violence, 13 are predominantly Muslim.

This cause of this is not ethnic or wealth-related; it stems from Muslim teachings and internal movements towards stricter Islam.Many powerful, rich and well-established Islamic organisations support schools of thought that are inherently intolerant.A strange thing in muslim militancy is, much of this violence is directed on Muslims by other Muslims, where strong Muslim communities exist alongside others outwards persecution is common, and often very severe.

Saudi Arabia pumps a great deal of money into a variety of radicalizing organizations.and as a consequence of their commitment to Wahhabi Islam. What may truly be needed is a wholesale, indigenous reformation of Islam. But grassroots movements towards strict Islam rise to counter the beginnings of liberalism in the Muslim world and its moderates are feeble and persecuted.There is a long way to go before Islam emerges from its Dark Ages.

5.Modern Judaism does not lend itself to violence or extremism. In history it has proven to be the most peaceable Abrahamic religion. Nonetheless Judaism has still amassed a monstrous catalogue of horrors in its name. If the stories of the Bible can be believed, the founding of Judaism occurred amidst pointlessly murderous battles with the rightful native inhabitants of Canaan and huge numbers of Biblical statements can be used to support violence and aggression in the name of religion. In history, Jewish nations conducted forced conversion en masse2. Modern terrorist incidents have also centered on the struggles to control land that has special religious significance for Jews in Israel.

"మనుషులు మతాన్ని ఎందుకు అనుసరించుతున్నారు?అన్ని మతాల సారమూ ఒక్కటే అయినప్పుడు కొందరు ఒక మతాన్ని వదిలి ఇంకొక మతానికి ఎందుకు వెళుతున్నారు?అనుయాయుల సంఖ్య పెరగడం వల్ల ఒక మతాన్ని అనుసరించేవారికి కలిగే అధిక ప్రయోజనం ఏమిటి?" అనే ప్రశ్నలని ఎవరికి వారు వేసుకుని జవాబులు సాధిస్తే ఈ మతాల మధ్యన కుమ్ములాటలు తగ్గవచ్చును,కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు?అప్పుడెప్పుడో అమేరికాలో జరిగిన ప్రపంచ ప్రపంచమతమహాసభ వల్ల ఒరిగినది ఏమిటి?ఆనాడు హిందూమతానికి ప్రపంచ స్థాయిలో గౌరవం పెంచిన వివేకానందుని వారసులు ఈనాడు తమకు హిందూమతానికి భిన్నమైన మతం అనే గుర్తింపు కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు!
ఇవన్నీ Pew Research Center’s Forum on Religion & Public Life అనే సంస్థ దేశాలు అని చెప్పడానికి కుదరని చిన్నా చితకా దేశాలను కూడా వదలకుండా మొత్తం 230 ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఆయా  జనసమూహాల నుంచి సేకరించిన సమాచారాన్ని కలిపి 2010ని ప్రమాణం చేసుకుని లెక్కించిన గణాంకాల నుంచి పిండిన నిష్పత్తులు.పూర్తి దృశ్యం కనబడాలంటే తెలుసుకోవాల్సిన అసలు సంఖ్యలు ఇలా ఉన్నాయి - 1). క్రైస్తవులు 2,100,000,000 ఉన్నారు గానీ భవిష్యత్తులో సంఖ్య అతి వేగంగా తగ్గుతూ 2050 నాటికి దామాషా నిష్పత్తిలో కూడా తరుగుదల కనిపించవచ్చు, 2).ముస్లిములు 1,500,000,000 ఉన్నారు గానీ భవిష్యత్తులో సంఖ్య అతి వేగంగా పెరుగుతూ 2050 నాటికి దామాషా నిష్పత్తిలో కూడా పెరుగుదల కనిపించవచ్చు, 3).హిందువులు 1,500,000,000 ఉండి భవిష్యత్తులో సంఖ్య స్థిరంగా నిలబడి 2050 నాటికి దామాషా నిష్పత్తిలో కూడా మార్పు ఉండకపోవచ్చు, 4).బౌద్ధులు 375,000,000 ఉండి భవిష్యత్తులో సంఖ్య స్థిరంగా నిలబడి 2050 నాటికి దామాషా నిష్పత్తిలో కూడా మార్పు ఉండకపోవచ్చు

ఎక్కువమంది హేతువాదులూ కొద్దిమంది ఆదర్శవాదులూ వ్యంగ్యంగానూ గంభీరంగానూ ఉటంకిస్తున్నట్టు అన్ని మతాలూ ఒక్కటి కాదు - క్రైస్తవ, మహమ్మదీయ, హైందవ, బౌద్ధ, యూదు మతాలు అయిదూ వాటిలోని విభిన్నత వల్లనే ఆయా మతాల అనుయాయుల్ని తమ మతాలను గురించి గర్వించేలా ఉత్తేజితుల్ని చేస్తున్నాయి.అయితే, ఆయా మతాచార్యులు అనుయాయులకు పాటించమని చెబుతున్న A Disdain for Materialism, A Distrust of Intellect, A Yearning for Divine Edification, Charity, Purity of Heart, Humility, Meekness అనే అంశాలు ఒక్కలానే ఉంటున్నాయి.ఇంతకీ, అనుయాయులకి వీటిని పాటించమని చెబుతున్న మతాచార్యులే వీటిని పాటించకుండా మతవ్యాప్తి కోసం తప్పుడు మార్గాలను పాటించటం వల్లనే మతాల మధ్య సయోధ్య కుదరటం లేదు.

తాను పాటించే మతాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అనేది మతాన్ని ఆధ్యాత్మికమైన ఔన్నత్యాన్ని సాధించడం కోసం ఉపయోగించుకుని ప్రశాంతజీవనం గదపాలని కోరుకునే అనుయాయులకి ముఖ్యం కాదు,అది వారికి ఎలాంటి అదనపు సంతృప్తినీ ఇవ్వదు,కాని అధికారాన్నీ సంపదనీ ఆశించే రాజకీయ నాయకులకీ వారికి సాయం చేసి  తమ మతానికి రాజమతం హోదా తెచ్చుకోవాలనుకునే మత ప్రచారకులకీ మాత్రం సంఖ్యని పెంచుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

ఆనాటి రాజరికపు వ్యవస్థలోనూ ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రజలకి మేలు చేసి సరైన పద్ధతిలో ప్రజాభిమానం పొందగలిగిన సమర్ధత లేనివాళ్ళు ప్రజల్లో తమపట్ల ఉండాల్సిన విధేయతని తెచ్చుకోవడం కోసం మతప్రచారకుల సాయం అడుగుతారు.రాజ ప్రాపకం వస్తే ప్రచారం కోసం వొళ్ళు నలగ్గొట్టుకుని వూళ్ళు పట్టుకు తిరిగే శ్రమ తప్పుతుందనుకున్న మతప్రచారకులు దానికి ఒప్పుకుంటారు.మిగిలిన మతాల కన్న క్రైస్తవ,మహమ్మదీయ మతాలలో ఈ ధోరణి చాలా ఎకువై ఆ రెండు మతాలూ సంఖ్యని పెంచుకోవడానికి మూలకారణం కూడా అదే అవుతున్నది.ఈ రెండు మతాల ఎదుగుదలా ఆ మతం గురించి తొలిసారి తెలుసుకున్నవారు ముగ్ధులైపోయి అనుసరించటం వల్ల గాక ప్రజల్ని ప్రలోభాలతో ఆశపెట్టి గానీ ప్రమాదాలను గురించి భయపెట్టి గానీ చేర్చుకోవటం వల్లనే జరిగిందనేది అందరూ ఒప్పుకుంటున్న విషయమే!

ప్రస్తుతం క్రైస్తవ మతం యొక్క దూకుడు తగ్గి మహమ్మదీయ మతం యొక్క దూకుడు పెరగటానికి గల కారణాలను పరిశీలిస్తే  ఒకదాని కొకటి పొంతన లేనివని మనం అనుకునేవాటిని కూడా మతవ్యాప్తి కోసం ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలిసి వాళ్ళ నీచత్వానికి నిశ్చేష్టులం కాక తప్పదు. మలాలా వంటి ఆడపిల్లలు చదువుకుంటే తీవ్రవాదులకి వచ్చే నష్టం ఏమిటి?మీడియా ముందూ ప్రచారవేదికల మీదా  ఆదర్శాలను వల్లించే సచ్చా ముసల్మానులు అన్ని మతాల కన్న మా మతంలోనే స్త్రీలకి ఎక్కువ రక్షణ ఉన్నదని చెప్పుకుంటున్నప్పుడు తీవ్రవాదులు ఆపిల్లల చదువుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?ఎందుకంటే, చదువు మీద దృష్టిపెట్టిన ఆడవాళ్ళు తగినంత సమయం దొరక్క పోవడం చేత తమ గర్భధారణ కాలాన్ని వృధా చేస్తూ ఎక్కువమంది పిల్లల్ని కనే వెసులుబాటు తగ్గుతుంది గనక!వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు సంవత్సరానికి ఒక ఈత ఈనటానికి మాత్రమే పనికివచ్చే పెంపుడు జంతువులు.

 Size and Projected Growth of Major Religious Groups

ఆయా మతాల సంఖ్య పెరగడానికీ ఆయా మతాలను అనుసరించే జనబాహుళ్యపు సంతానోత్పత్తి సామర్ధ్యానికీ ఆ మతానుయాయుల్లోని యువకుల సంఖ్యకీ అనులోమ సంబంధం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.

 Total Fertility Rate by Religion, 2010-2050

ఇస్లాం మతానికి బలం పేరగడానికి చెబుతున్న రెండింటిలో మరొక మూలకారణం అయిన వయస్సుల వారీ పరిస్థితి కూదా ముస్లిములకే అనుకూలం అంటే Multiply,Migrate,Manipulate అని చెప్పిన క్రీ.శ 7వ శతాబ్ది నాటి అహ్మద్ ఖురేషీ యొక్క ముందుచూపు  ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు!

For the purposes of projecting future growth, the number of women in their early reproductive years also is a key factor. As of 2010, 13% of the world’s population consisted of females between the ages of 15 and 29. Muslims were the only major religious group with a higher share of women in this category (14%) than the global average, yet another reason the Muslim population is poised for rapid growth in the coming decades. The religiously unaffiliated (11%) and Jews (10%) had the lowest shares of women ages 15-29 in their populations, as of 2010.

లోకంలో అందరూ తలిదండ్రులకి మొదట సంపదను ఆర్జించి దాన్ని పంచి ఇవ్వటానికి పిల్లల్ని కనమని చెబుతారు,కానీ ముస్లిములు ఎంత దరిద్రంలో ఉన్నా సరే మతవ్యాప్తి కోసం పిల్లల్ని కంటున్నారు,పెరిగే వయసులో దరిద్రానికి తోడు అంతరాల్ని చూసి ఆవేశపడి వాళ్ళు తీవ్రవాదం వైపుకి వెళ్తున్నారు,దరిద్రం తెలియని కొందరు ధనవంతులైన ముస్లిం కుర్రాళ్ళు నాయకత్వం మీద మోజుతో తీవ్రవాదం వైపుకి వెళ్తున్నారు,మతప్రచారకులూ అధికారంలో ఉన్నవాళ్ళూ వీళ్ళ శవాలతో తమ నివాస భవనాల అంతస్థుల్ని పెంచుకుంటున్నారు - ఎవరి తృప్తి వారిది!

PEW సంస్థ పరిశీలనలో మతవ్యాప్తి విషయంలో బలవంతపు మతాంతరీకరణలకు ఎక్కువ ప్రాధాన్యత లేదని తెలుస్తున్నది.అయితే ఒక మతస్థులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళటం మాత్రం ఆయా ప్రాంతాలలో ఆయా మతానుయాయుల నిష్పత్తిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది.
ఇతర మతాలలో దాదాపు ప్రతి మ్మతమూ ఒకటి కన్న ఎక్కువ దేశాలలో చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించటమే కాక అక్కడ పాతుకుపోయి రాజకీయాధికారం గురించి కూడా ఆలోచిస్తుంటే హిందువులు మాత్రం పుణ్యభూమి, జన్మభూమి, కర్మభూమి అని పులకిస్తూ భారతదేశం దాటి వెళ్ళడానికి సిద్ధంగా లేరని తెలుస్తున్నది గద!ఈ శతకోటి మతాలు పుట్టకముందే ప్రపంచమంతటికీ పాకిపోయి సనాతన ధార్మిక సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఒకనాటి సాహసం ఏమైపోయింది?

ఉన్న ఒక్క భూఖండంలోనూ దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో వెలిగిపోవడం లేదు - కులశ్రేణుల మధ్య ఔన్నత్యపు శిఖరారోహణ కోసం జరుగుతున్న పరస్పరావరోహణపు చండాలం తప్ప హిందువుల నిజమైన ఔన్నత్యం భూతద్దంతో వెతికి చూసినా కనబడటం లేదు.నాలుగు రోజుల క్రితమే నా ముఖపుస్తకపు గోడ మీద Kshatriya Vamsha Kapus పేరుతో KAPUS(BALIJAS) ARE KSHATRIYAS.NORTH INDIAN RAJPUTS AND KAPU BALIJAS ARE SAME COMMUNITY.WE HAVE NO RELATION WITH KURMIS.WE ARE KSHATRIYAS.WE ARE ROYAL RAJPUTS.JAI BALIJAS.JAI RAJPUTS. అనే ప్రకటన ఒకటి కంబడింది.కిందనే Onkar Singh అనే కుర్మి కులానికి సంబంధించిన వ్యక్తి For how many meetings n platforms Kapus n Balijas shared with Rajputs, they consider u Dravid having no similarity with Rajputs, As fr kurmi kshatriyas concerned it is big comm. all over the India, in some regions they r too forward n great warriors, Chhatrapati Shivaji Maharaj n Sardar Ballabh Bhai Patel are icon of the comm n in some places they r poor.. We consider u as our brother... Jai Sardar... Jai Shivaji Maharaj. అని ప్రకటనలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తూ వేసిన కామెంటునీ చూశాను.దానికి మళ్ళీ Kshatriya Vamsha Kapus చెప్పిన BUT WE NEVER CONSIDER YOU AS OUR BROTHER BECAUSE YOU ALL ARE UNTOUCHABLES (DALITS) IN TAMILNADU STATE (MY OWN STATE) AND YOU ARE NOT OUR COMMUNITY ONLY RAJPUTS ARE OUR BROTHERS JAI MAHARANA PRATHAP SING SISODIA. అనే జవాబులోని అహంకారం చూసి నాకు ఎంత కోపం వచ్చిందో మాటల్లో చెప్పలేను!

నేను THEN WHY MUDRAGADA IS FIGHTING TO GET RESERVATIONS WHICH MEANT FOR DALITS AS THEY FACE UNTOUCHABILITY FOR AGES? అని అడిగాను.దానికి Kshatriya Vamsha Kapus నుంచి వచ్చిన జవాబు ఇది:SIR I ONLY MENTIONED ABOUT THE DIFFERENCE OF TWO COMMUNITIES THAT IS MY POINT - ఏం చెయ్యాలి చెప్పండి వీళ్ళని!పాయింటు చెబుతున్నాడంట, బోడి పాయింటు! ఈసారి నేనూ నా అసలు పాయింటు విడమర్చి చెప్పాను HOW A COMMUNITY IS DIFFERENT FROM ANOTHER COMMUNITY?BY LINEAGE?DO YOU THINK ALL THESE SOORYAVAMSA, CHNDRAVAMSA LINEAGES ARE REAL AND CONSTANT?DOES LINEAGE WILL FETCH YOU REAL VIRTUE?IF LINEAGE AND VIRTUE ARE DIFFERENT,WHY YOU MENTION KURMI LINEAGE BELONG TO DALIT AND KAAPU LINEAGE WAS EQUAL TO KSHATRIYAS LIKE RAJPUTS? అంటూ,

ఎవరో ఎక్కడో ఆంధ్రాలోని కాపులనీ తమిళనాడులోని కుర్మీలనీ ఒకే గాటన కట్టి విశ్లేషణ చేస్తేనే సహించలేనివాళ్ళు, వాళ్ళ ముఖం మీదనే "మీరు అస్పృశ్యులు!మేము క్షత్రియులం!మీకూ మాకూ సాపత్య మేమిటి?" అని వదరుతున్న సంస్కారహీనులు ఏ ముఖం పెట్టుకుని అదే అస్పృశ్యుల కోసం పెట్టిన రిజర్వేషన్లలో వాటా కోసం ముద్రగడ వెనక పళ్ళాలు మోగించుకుంటూ తిరిగారో!

PEW విశ్లేషణలు గాలికబుర్లు కావు - వాటికన్ కూడా వీటి గురించి తెలుసుకుని నమ్మలేక తను సొంత సర్వే చేసుకుని నిర్ధారించుకుని ఇస్లామిక్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో తెలియక తెల్లమొహం వేస్తున్నది.ఒకప్పుడు అక్కడ చెల్లుబాటు కాని తక్కువ మంది వచ్చి పడినందుకే దేశం అతలాకుతలమై పోయంది - రేపు ప్రపంచ జనాభాలో మూడవ వంతుకు పెరిగి మిడతల దండులా వచ్చిపడితే ఈ కాపు క్షతియ వీరులు ఒక్కరే అసహాయ శూరులై దేశాన్ని రక్షించగలరా?వీరు సరిసాటివారమని పోల్చుకునే రాజపుత్రులే మొఘలు సింహాసనానికి దాసోహమని సామంతులై ఢిల్లీ సభలో కుర్చీలు వేయించుకుని సర్దుకుపోయారు - వీరెంత?

ముస్లిముల దాడిని తట్టుకోవటం అంటే మెంటల్ పద్మనాభం వెనక తిరిగి రైళ్ళని తగలబెట్టినటూ పళ్ళాలు మోగించినట్టూ ఉండదు - బాబరు పదివేల మంది సైన్యం ఢిల్లీ సుల్తాన్ లక్షమంది సైనికుల్నీ నలిపేసింది.మోప్లా వూచకోతలో లక్షమంది హిందువుల్ని వారం రోజుల్లో నరికేసింది విదేశీయులు కూడా కాదు,కొన్ని తరాల ముందు హిందువులై మతం మారిన ఇక్కడివాళ్ళే - అంకెకి తక్కువున్న అప్పుడే అంత క్రౌర్యం చూపించినవాళ్ళు రేపటి రోజున సంఖ్యని పెంచుకున్న ధీమాతో విరుచుకుపడి హైందవ ధార్మిక క్షాత్రపు గర్వాన్ని పిండి పిండి చేస్తూ ఓడించి పారేసి పెడరెక్కలు విరిచి కట్టి తలల నరుకుడు వరసలో కూలేసినప్పుడు కుర్మీ తల,కాపు తల,రాజ్పుట్ తల ఒక్కలాగే కనిపిస్తుంది నరకడానికి కత్తి ఎత్తిన ముస్లిముకి - బహుపరాక్!


2050 ఇంకెంతో కాలం లేదు,జస్ట్ 30 ఏళ్ళు మాత్రమే!

Sunday 17 December 2017

ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడే ఎందుకు కట్టారు?తర్వాతెప్పుడో Fibonacci కనుక్కున్న విశేషం వాటిల్లో ఇమడ్చటం ఎట్లా సాధ్యపడింది!

     హిందువులని అవమానించటానికి తగులుకున్న ప్రతివాడూ మొదట యెత్తుకునే పాట రాళ్ళని పూజిస్తూ మూఢనమ్మకాల పుట్టల్లా బతుకుతున్నారని!"విగ్రహంలో దేవుడు ఉంటాడా?ఉన్నది ఒకే దేవుడైతే ఇంతమంది దేవుళ్లకి పూజ చెయ్యటం తప్పు కాదా?" అని పాట పాడుతారు పదే పదే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా అన్నట్టు.ముఖ్యంగా ఒకరు జాత్యహంకారంతోనూ ఒకరు యుద్ధోన్మాదంతోనూ వ్యాపించి సంఖ్యని పెంచుకుని విర్రవీగుతున్న క్రైస్తవ మహమ్మదీయ మతాల వారికీ శాస్త్రీయతా ఆధునికతా తమవద్దనే పోగుపడినట్టు పోజులు కొట్టే నాస్తిక మార్క్సీయ మేధావులకీ హిందువుల ఆలయాల్ని చూస్తే ఎంత అపహాస్యమో,అసహ్యమో!

     500 యేళ్ళ క్రితం మార్క్సిజమూ లేదు,1500 యేళ్ళ క్రితం ఇస్లామూ లేదు,3000 యేళ్ళ క్రితం క్రైస్తవమూ లేదు - నిన్న గాక మొన్న పుట్టిన మతాల వాళ్ళు సర్వజ్ఞుల మాదిరి రెచ్చిపోతున్నారు,వీళ్ళూ వీళ్ళ మతాలూ వీళ్ళ సైన్సులూ  పుట్టకముందే ప్రపంచ మానవాళికి జ్ఞానబోధ చేసి ఆయా జాతుల్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన సనాతన ధర్మం నిజమైన జ్ఞానులకి ఉండే వినయాన్ని చూపిస్తున్నది.తమ కోడిమెదళ్ళకి అర్ధం కానివన్నీ మూఢనమ్మకాలేనని అనుకుంటున్నవాళ్ళకి తెలియదు తమలోని శాస్త్రీయతకి కారణమని దేన్ని చెబుతున్నారో ఆ మోడ్రన్ సైన్సు వాడుతున్న గణీతశాస్త్రం ఇక్కడ వృద్ధి చేసినదేనని!

     సైన్సు యొక్క అర్ధం,పరమార్ధం తెలిస్తే ఆ సైన్సుని కాలుష్యాన్ని పెంచడానికీ అణ్వస్త్రాల్ని తయారుచెయ్యడానికీ ఎందుకు ఉపయోగిస్తారు?కార్లనీ విమానాల్నీ కనుక్కుంది మోడ్రన్ సైన్సు అనేవాళ్ళు వాటివల్ల వస్తున్న కాలుష్యానికి నివారణ చెప్పగలరా?సనాతనధర్మం వీటికి భిన్నం - క్షయం లేని వృద్ధిని మాత్రమే కోరుకుంటుంది, నేర్చుకుంటుంది, సాధిస్తుంది!మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించి క్షయం లేని వృద్ధిని సాధించుకోవడం కోసమే భారతీయ విజ్ఞానులు గణితం, భౌగోళికం, రసాయనం, వైద్యం వంటి ఎన్నో రంగాలలో గురుశిష్యపరంపరతో సహస్రాబ్దాలుగా కృషి చెసి ఇంకేదీ కొత్తగా కనుక్కోవాల్సీన అవసరం లేనంత జ్ఞనరాశిని పేర్చారు.

     వాళ్ళు కనుక్కున్నవాటిని వాడుకోవటం తెలియక ముప్పయ్యఏళ్ళకే బట్టతల,నలభయ్యేళ్ళకే గుండెజబ్బు,యాభై యేళ్ళకే రక్తపోటు అనే రోగాలమారి బతుకులు బతుకుతున్నాం - ఇదే గొప్ప అనుకుంటున్నాం.సృష్టిలో ఏదీ అనుకోకుండా,యాధాలాపంగా జరగదు - ప్రతిదాని వెనక ఒక లెక్క ఉంటుంది,ఆ లెక్క తెలియకపోవడం వల్లనే అది ర్యాండం అనుకుంటున్నాం.మన దేహాన్ని ఓకసారి గమనించండి.చేతి వేళ్ళకి మూడు కణుపులు ఉంటాయి.ఈ వేళ్ళు అతుక్కున్న చేతి నుంచి భుజం వరకు మూడు భాగాలు,ఈ భుజం అతుక్కున్న దేహానికి తల,పొట్ట ,కాళ్ళు అనే మూడు భాగాలు -- అంతా లెక్క ప్రకారమే ఉంది,ఈ లెక్కలు మన ప్రాచీనులకి ఎలా తెలిశాయో గానీ తెలిసిన విషయాలని ఉపయోగించుకుని ప్రశానతంగా జీవించారు.తమతోనే నాశనం చెయ్యకుండా తర్వాత తరాల వారికి అందించారు.వాళ్ళకి ఏమీ తెలియదని అనుకున్నవాడు అయితే పిచ్చివాడన్నా అవ్వాలి, లేదంటే మనుషులు ప్రశాంతజీవనం గడుపుతుంటే చూసి భరించలేని దుర్మ్మార్గుడైనా అవ్వాలి.

     Fibonacci (c. 1175 – c. 1250) అనే అతను ప్రకృతిలో ఒక వింత అమరికని చూశాడు.దానిని గమనించి ఒక గణితసూత్రాన్ని తయారు చేశాడు.మామూలుగా ఈ తరహా సీరియస్ విషయాలంటే బోరు కొట్టేవాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది అతను కనుక్కున్న విషయం.అంకెల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్ళాలి,కండిషన్ ఏమిటీ అంటే మొదటి అంకె నుంచి చివరి అంకె వరకు ఎక్కడనుంచి మొదలుపెట్టి పక్కపక్కనే ఉన్న మూడు అంకెల్మి తీసుకున్నా మొదటి రెండు స్థానాల్లో ఉన్న అంకెల్ని కూడితే మూడో అంకె రావాలి = 0,1,1,2.3.5,8,13,21 ఇలా.చిత్రమేమిటంటే మొక్కలు కొత్త ఆకుల్ని పుట్టించుకోవడంలోనూ నత్తలు తమ గుల్లల్ని పెంచుకోవడంలోనూ ప్రకృతి ఈ వరసనే పాటిస్తున్నది.
     అబ్రహామిక్ మతాలైన ఈ తల్లి,పిల్ల మతాలు రెండూ దేవుడు మనిషిని మిగిలిన అన్ని జీవరాసుల కన్న అధికుణ్ణి చేసి ఈ సృష్టి మొత్తాన్ని అతను తినడానిక్కీ తాగడానికీ దోచుకోవడానికీ హక్కుభుక్తం ఇచ్చేశాడని చెబుతున్నాయి.ఈ మతాల ధోరణి యేమిటంటే - బోధించేవాళూ పాటించేవాళ్ళూ కూడా మొదట ఈ సృష్టి మొత్తానికి తనని కేంద్రంగా పెట్టుకుని తనవైపునుంచే చూస్తూ తమ స్వోత్కర్షతో "సృష్టిలో కల్లా మానవుడు గొప్పవాడు. మానవులలో కల్లా నేను గొప్పవాణ్ణి. నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను పాటించే మతం, నేను తినే తిండీ, నేను తాగే ద్రవం అన్నీ గొప్పవే.నేను తప్ప ఇతరులు అధములు, అనాగరికులు, అణిచివేయదగినవాళ్ళు!" అనుకుంటూ ఉంటారు.

     ప్రపంచ మానవాళి చరిత్రలో సమస్త ప్రజల్ని ఒక్కలా ఉద్వేగానికి గురి చేసిన అద్భుతమైన సన్నివేశాల్ని లెక్కిస్తే  గత రెండు వేల యేళ్ళలో జరిగినవి చాలా తక్కువ - వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు!ఆ తక్కువలో తక్కువ సన్నివేశాల్లో భారతీయ మేధావుల ప్రమేయం ఉన్నది - జీవశాస్త్రంలో D.N.A రహస్యాన్ని విప్పి చెప్పినది హర గోవింద ఖురానా, బృహత్తారల విషయంలో వాటి పరిమాణం గురించి చెప్పినది చంద్రశేఖరన్, వైద్యశాస్త్రంలో మొండిరోగాల్ని నయం చెయ్యడం కోసం ఎన్నో కొత్త మందుల్ని కనిపెట్టినది ఎల్లాప్రగడ సుబ్బారావు, గాడ్ పార్టికిల్ అనే దానికి బోసాన్ అని పేరు పెట్టించుకున్న వ్యక్తి భారతీయుడే!డబ్బు సంపాదించడంలో ఏమన్నా వెనకబడ్డారా అంటే అదీ లేదు.ఇవ్వాళ ఉన్న రూపంలో ఒకే దేశంగా లేనప్పటికీ ప్రాంతం అనేదాన్ని ప్రమాణం చేసుకుని చూస్తే వాళ్ళు లెక్కలు వేసి చెప్పిన దాని ప్రకారమే క్రీ.శ 1వ శతాబ్దం నుంచి క్రీ.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలూ కలిసి సృష్టించగలిగిన సంపదలో మూడో వంతు నుంచి నాలుగో వంతు సంపదని సృష్టించగలిగిన దమ్ము వీళ్ళది!

     ఎందులో వెనకబడ్డామని హిందువులు ఏడవాలి?ఏమి తప్పు చేశారని భారతీయులు సిగ్గు పడాలి?ఎన్నాళ్ళు బ్రాహ్మణుల ఆధిక్యత, దళితుల అణచివేత, హిందూమతం యొక్క క్రూరత్వం, అసహాయుల ఆక్రందన అంటూ సొల్లు కబుర్లు చెప్తారు?నిజమే, ఒకనాడు అస్పృశ్యత ఉంది,మనుస్మృతిలో దాన్ని సమర్ధించే శ్లోకాలు ఉన్నాయి.నా బ్లాగులోనూ వాటిని సాక్ష్యాలు చూపించి చెప్పాను.కానీ ఉందని చెప్పి బ్రాహ్మల్ని తిట్టటంతో సరిపెట్టుకోకుండా దానినుంచి బయటపడటానికి దళితులకి ఎన్నేళ్లు పడుతుంది?రిజర్వషన్ల మీద అంత ఆశపెట్టుకుని పోరాడి సాధించిన అంబేద్కర్ 1950లోనే "నా కెప్టెన్లు నన్ను మోసం చేశారు. రిజర్వేషన్లని నేను వూహించిన పద్ధతిలో ఉపయోగించుకోవటం లేదు, స్వార్ధపరులైపోయారు" అని కన్నీళ్ళు పెట్టుకున్న సన్నివేశం జరిగిందా లేదా?

     ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?మాటిమాటికీ అంబేద్కరు నామం జపిస్తూ కొన్ని వేలయేళ్ళనాటి బ్రాహ్మణుల దుర్మార్గాల్ని కూడా కనిపెట్టి వెలికి తియ్య్యగలిగినవాళ్ళు నిన్న గాక మొన్న అంబెద్కర్ ఎవరి గురించి ఆ మాటలు అన్నాడో కనిపెట్టలేరా?ఎవడి స్వార్ధం వాడు చూసుకోవటానికి అణిచివేయబడిన కులాల నుంచి వచ్చిన దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?

     ఒకానొకప్పుడు కులదోపిడీ జరిగింది,నిజమే!అయితే, ఆ కులదోపిడీ నుంచి బయటపడటానికి డా.అంబేద్కర్ వజ్రాయుధం కన్న బలమయిన ఆయుధమే ఇచ్చాడు,దాని శక్తిని తెలుసుకుని ఉపయోగించుకోవాల్సినవాళ్ళు సరైన తీరున ఉపయోగించుకుంటే కేవలం పదేళ్లు చాలు కులదోపిడీ నుంచి ఆయా కులాలు బయటపడటానికి!మరి, డెబ్బయ్యేళ్ళ తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు లేనిదే బతకలేని స్థితిలో ఎందుకు ఉన్నారు?అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లలో మొదటి భాగం అర్హతలు విద్యకైనా ఉద్యోగానికైనా ప్రాతినిధ్యానికైనా  అవసరమైన అర్హతలకి పెట్టుకున్న కొలబద్దకి అతి దగ్గిరగా వచ్చినవాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కల్పించడమే తప్ప అర్హత ఏమాత్రం లేనివాళ్లని వెనకబడినకులం పేరుతో ముందుకు తొయ్యమని కాదు, అవునా?

     అదీ గాక అంబేద్కర్ చెప్పిన రెండో భాగం ప్రత్యేకించి వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లని అందుకుంటున్నవారికి - "ఈ రిజర్వేషన్ సౌకర్యం మీకు వ్యక్తిగత దరిద్రాన్ని వదిలించుకోవడానికి గాక మీ కులానికి సరయిన ప్రాతినిధ్యం ఉండటం కోసం కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకుని పైకి రావటంతో సరిపెట్టుకోకుండా మీ కులంలోని ఇతరులని కూడా మీలాగే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి!" అని  నొక్కి చెప్పాడు, అవునా?మరి, ఇన్నేళ్లుగా ఆనాడు అంబేద్కర్ స్వయంగా ఆరోపణ చేసినట్టు కుక్షింభరులై తమ సొంత కులాలనే పట్టించుకోనివాళ్ళకి బ్రాహ్మణుల్ని తమ కులాలకి అన్యాయం చేశారని విమర్శించే హక్కు ఉందా!మరి, ఇవ్వాళ ఏ విధమయిన అస్పృశ్యతనీ అనుభవించని కాపులు వీళ్ళతో పోటీపడి వీళ్ళ వాటాని తగ్గించడానికి వస్తుంటే వాళ్లతో పోట్లాడి వీళ్ళ హక్కుల్ని రక్షించుకోవడానికి నోళ్ళు పెగలడం లేదు, కారణం ఏమిటి?నోరూ వాయీ లేని బ్రాహ్మణులే దొరికారు వీళ్ళకి - సిగ్గు లేకపోతే సరి.

     పొద్దున్న మంచం మీదనుంచి దిగితే రాత్రికి మళ్ళీ మంచం ఎక్కేవరకు ఏ పని చెయ్యాలన్నా ముందు కడుపులో నాలుగు ముద్దలు పడాలి,వయసులో చిన్నవాడివయితే అమ్మానాన్నలు పెడితే తినాలి.పెద్దవాడివయ్యాక నువ్వు తినడంతో పాటు అమ్మానాన్నలకి కూడా పెట్టాలి,అంటే మీ నాన్న కన్న ఒక మెట్టు పైకి వెళ్ళాలి.ఇవ్వాళ తినాల్సినదాన్ని నిన్ననే తెచ్చుకుని దాచుకోవాలి,అది కూడా తేరగా రాదు, వెతుక్కోవాలి,ఆ వెతుకులాట ఫలితం ఇవ్వాలంటే జ్ఞానం కావాలి,జ్ఞానం కావాలంటే గురువును వెతుక్కోవాలి.నీకు యేది కావాలో దాన్ని సాధించిపెట్టే గురువుని వెతుక్కోవాలి గానీ డబ్బులు సంపాదించుకోవటం కోసం ఆత్మవిద్య నేర్పే గురువు దగ్గిరికీ ఆత్మవిద్యని సాధించుకోవటం కోసం వ్యాపారస్తుడి దగ్గిరికీ వెళ్తే ఏమవుతుంది?

     గురువు దగ్గిరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనకి నమస్కరిస్తునావు,ఎందుకు?జ్ఞానంలో నీకన్న ఆధికుడు గనక,నేర్చుకోవాల్సిన అవసరం నీది గనక - మరి,జ్ఞానంలో అంతరువులు ఉన్నప్పుడు సమాజంలో ఉండవా!ఉంటాయి,ఉండి తీరుతాయి,అంతరాల్ని చెరిపేసి అందర్నీ సమానం చెయ్యడం అసాధ్యం.ఒక టీచరు ముప్పయి నలభయి మంది పిల్లలకి ఒకే పాఠాలు ఒకేలా చెప్పినా పరీక్షల్లో మొదటి మార్కు ఒక్కడికే వస్తుంది.ఎవరి జ్ఞానానికి ఏ స్థాయి సరిపడుతుందో తెలుసుకుని వారు ఆ స్థాయిని చేరుకోగలిగితే చాలు, జన్మలు ధన్యమైనట్లే!

     ఒకే రకం సమస్యకి ఏ ఇద్దరూ ఒకేలా స్పందించరు, ముగ్గురు మనుషులు మూడు రకాలుగా స్పందిస్తారు - ఒకడు ముందే తెల్లమొహం వేసి "దీన్ని పరిష్కరించడం ఎవడికీ సాధ్యం కాదు!" అని చెప్పి కూర్చుంటాడు - వీడు తామసుడు, ఒకడు కొంత ప్రయత్నించి చూసి "నాకే సాధ్యం కాలేదు గాబట్టి ఇంకెవడికీ సాధ్యం కాదు!" అని చెప్పి కూర్చుంటాడు - వీడు రాజసుడు, ఒకడు సమస్య రావడం ఎలా వచ్చినా దాన్ని పరిష్కరించటానికి ఇప్పటి తన జ్ఞానపరిధి చాలకపోవటమే అసలు కీలకం అని తెలుసుకుని తన జ్ఞానాన్ని పెంచుకుని సమస్యని పరిష్కరిస్తాడు.అప్పుడు ఇతర్లకి పనికి వస్తుందని తన అనుభవాన్ని గ్రంధస్థం చేస్తాడు - ఎప్పుడు మొదలైందో తెలియని సనాతన ధార్మిక సాహిత్య సృష్టి ఇలాగే జరిగింది!

     సనాతన ధార్మికుల విజయరహస్యం గణితశాస్త్రంలో అఖండమైన ప్రజ్ఞని సాధించటమే!"ఇక్కడ లేనిది ఎక్కడా లేదు,అక్కడ ఉన్నది ఇక్కడా ఉన్నది!" అని చెప్పి ఒప్పించగలిగిన స్థాయిలో జ్ఞానం వృద్ధి పొందటానికి వీరి గణితశాస్త్ర ప్రతిభయే కారణం.
     ఇది ఇప్పుడు బయటపడిన శిధిలాలను బట్టి సైంటిస్టులూ ఆర్టిస్టులూ కలిసి రూపొందించిన అప్పటి లోధాల్ నగరపు వూహాత్మక నమూనా పటం.క్రీ.శ 21వ శతాబ్దంలో ఉన్న మనకి ఈపాటి నిర్మాణం పెద్ద వింత కాకపోవచ్చు,కానీ హరప్పా, మొహంజెదారో, లోధాల్, ధొలవిర లాంటి నగరాల నిర్మాణ కౌశలం వారి సంకాలికులలో మరేవరయినా సాధించారా అనే దృష్టితో వెతికితే ప్రపంచం మొత్తం తిరిగినా మరెక్కడా కనబడటం లేదు.వీటిని నిర్మించడానికి కావలసిన ముఖ్యమైన వనరు తగినంత భూమీ, సరిపడినంత సంపదా, అవసరమైనన్ని పనిముట్లూ కాదు - మేధస్సు!

     ఇప్పుడు మనం వైదికయుగం అని చెప్పుకుంటున్నది రమారమి వీటి నిర్మాణం జరిగిన కాలం - అది బహుశా క్రీ.ఫూ 3000 నుంచి 5000 మధ్యన ఉండవచ్చునని ప్రస్తుతపు లెక్క,ఇది ముందు ముందు మారవచ్చు.కానీ ఇంత స్థాయిలో విజ్ఞానం అంత హఠాత్తుగా అప్పుడే తన్నుకొచ్చిందని అనుకోలేము కదా!నాకు తెలిసిననతవరకు ఈ నగర నిర్మాణానికి అవసరమైన రేఖాగణిత పరిజ్ఞానం మొదట ధృవనక్షత్రం యొక్క స్థిరత్వాన్ని కనుక్కోవడంతో మొదలై జలపాతంలా ఉబికి వచ్చింది.ధృవనక్షత్రానికీ నగర నిర్మాణానికీ ఉన్న సంబంధం ఏమిటో ఇదివరకు ఒకసారి చెప్పాను,అయినా మళ్ళీ చెబుతాను.అప్పటికే పోగుపడిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ప్రతిదీ సాపేక్షం అనే విషయాన్ని మనవారికి ఎప్పుడో నేర్పింది.కానీ పరిశీలించి చూస్తే ఇన్ని సాపేక్ష విలువల మధ్యన కొన్ని మాత్రం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఉదాహరణకి కాంతివేగం స్థిరమైనది అనటం కూడా సాపేక్షమే,కానీ దాన్ని కూడా సాపేక్షం అనుకుంటే లెక్క తెగదు..అట్లాగే ధృవనక్షత్రం కూడా విశ్వం యొక్క అక్షానికి కొంచెం దూరంగా ఉండి చలిస్తూనే ఉన్నది,కానీ మిగిలిన వాటి కన్న కొంత నయం.కాబట్టి ఆ ధృవనక్షత్రాన్ని ప్రమాణం చేసుకుని దానితో పోల్చి దిక్కులని గుర్తించడం తెలియకపొతే ఒక్క సరళరేఖనీ వృత్తాన్నీ తప్ప ఇంకే ఆకారాన్నీ గియ్యడం కుదరదు.

     అలా ఇతరుల కన్న ముందు గణితశాస్త్రం,ఖగోళ శాస్త్రం అనే జోడుగుర్రాల రధం మీద పరుగులు పెడుతున్న సనాతన ధార్మిక విజ్ఞానులు సాధించిన విజయాలు ఇతరులు కలలో కూదా వూహించలేనివి.ఈనాటికీ కొన్ని శిధిలాలు గానూ కొన్ని సజీవంగానూ సాక్ష్యాలు కనబడుతున్నాయి గనక నమ్ముతున్నాం గానీ ఆ సాక్ష్యాలు లేకుండా ఆ నిర్మాణాలు చెసినట్టు కేవలం గ్రంధాలలో మాత్రమే చదివితే నమ్మడం కష్టం!
     భారతీయ విజ్ఞానవేత్తలే కాదు ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత ఉన్న ఏ దేశపు శాస్త్రవేత్తలైనా తిరిగి మరోసారి నిర్మించలేని అద్భుతమైన నిర్మాణం ఇది - ఎల్లోరా లోని కైలాసనాధ దేవాలయం!ఇప్పటికీ ఏదైనా భవనం కట్టాలంటే ముందు పునాది వేసి ఆ ప్లాను మీద పైకి కట్టుకుంటూ వచ్చి స్తంభాల్ని విడిగా చెక్కి పునాదుల మీద కట్టిన మండపం మీద నిలబెట్టి మళ్ళీ పైకప్పు వేరేచోట చెక్కి ఈ స్తంభాల మీద నిలబెట్టడమే అలవాటుగా జరుగుతున్నది.కానీ ఈ ఆలయం మొత్తాన్ని ఒకే రాతిని పైనించి కిందకి తొలుచుకుంటూ వెళ్ళారు!మళ్ళీ ఎవరూ ఇలాంటి కట్టడాన్ని నిర్మించడానికి ప్రయత్నించలేదంటేనే అది ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు.

     క్రీ.శ 756-క్రీ.శ 776 మధ్యన రాష్ట్రకూట వంశానికి చందిన 1వ కృష్ణ మహారాజు నిర్మించినట్టు తప్ప ఇతర వివరాలు ఏమీ తెలియడం లేదు.నిర్మాణం ఎలా జరిగిందనే ఆధారాలు లేకపోవడం వల్ల నిర్మాణం ఎలా జరిగిఉండవచ్చును అని వూహించడానికి ప్రయత్నిస్తున్న చరిత్రకారులకి మతులు పోతున్నాయి!
     ఇంత సూక్షమైన వివరాల్ని కూడా జీవం ఉట్టిపడేలా చెయ్యడానికి తొలిచిన రాతి పరిమాణమే 400,000 టన్నుల పైన ఉండొచ్చు.ఇప్పటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పది 10-Ton JCB machines వాడినా అంత స్థాయిలో రాతిముక్కల్ని తొలగించడం అసంభవం!అసలు ఆ తొలగించిన రాతిముక్కలకి సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడా కనపడటం లేదు.ఎక్కడ పారబోశారో ఆనవాళ్ళు కనపడటం లేదు,రాళ్ళు కదా కుళ్ళిపోయాయో కరిగీపోయాయో అనుకోవడానికి వీల్లేదు.

     ఇవ్వాళ్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తే ఎంత కాలం పట్టవచ్చునని ఎంత నిక్కచ్చి అంచనా వేసినా తొలగించాల్సిన 30,000 టన్నుల రాతిముక్కలకీ ఒక్కో 10-Ton JCB machine 100 టనుల్ని తొలగించగలదనుకుంటే రోజుకి 1000 టన్నుల్ని పూర్తి చేస్తూ ఆపకుండా 200 రోజులు,ఆరు నెలలు పడుతుంది.మరి,అపుడు ఎంతకాలం పట్టిందో తెలియదు.ఏదో హడావిడి చేసి చుట్టేసి అంత కష్టమైనది ఇంతకన్న ఎవరు చెయ్యగలరులే అని జాలిపడి మెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు - వంతెనలు, సరస్సులు, నేల మాళిగలు, మెట్లు అన్నింటినీ చిన్న చిన్న వివరాల్ని కూడా చూపిస్తూ చెక్కారు!

     ఇవ్వాళ ఏవరినన్నా కట్టమని అడిగితే ముందు నాకు ఒక వంద CAD లోడ్ చేసిన కంపుస్కూటర్లూ మరో యాభై 3డీ ప్లాటర్లూ ఇవ్వమంటాడు.మీగ్గానీ ఎవరినన్నా రెచ్చగొట్టి కట్టించుదామనే దురద ఉంటే మీరే మట్టానికి మునిగిపోతారండి - పరిశోధకులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు Repeating such a feat even by using modern technology is almost impossible అని!ఒక L.K.G కుర్రాడి ముందు ఒక Ph.D Thesis పెట్టి చదివి అర్ధం చెప్పమంటే వాడేం చేస్తాడు?తెల్లమొహం వేస్తాడు,నాకు అర్ధం కావడం లేదంటాడు - అది వాడి తప్పు కాదు.కానీ అబ్రహామిక్ మతాల వాళ్ళకీ కమ్యునిష్టులకీ హిందూమతం గురించి మాట్లాడేటప్పుడు ఆ కుర్రాడికున్న నిజాయితీ కూడా ఉండదు - దాన్ని అర్ధం చేసుకోవటానికి తమ ప్రస్తుత జ్ఞానపరిధి చాలటం లేదని ఒప్పుకోవటానికీ ఒప్పుకుని హిందువులని అడిగి విషయం తెల్సుకోవటానికీ అహం అడ్డొచ్చి "మాకు అర్ధం కావటం లేదు కాబట్టి ఇదంతా చెత్త!" అనేస్తారు.

     గౌరీ లంకేశ్ సంస్మరణకి కర్నాటక వెళ్ళి వచ్చిన ఒక తెలుగు కమ్యునిష్టు వాళ్ళలో ఒకరు లింగాయతులతో "మీ బసవణ్ణని చంపిన హిందూమతంలో మీరు భాగం  ఎట్లా అవుతారు?" అని ప్రశ్నించడం, దానికి లింగాయతులు తీవ్రంగా ప్రతిస్పందించడం గురించి గొప్ప వ్యంగ్యపరిభాష వాడి చెప్పుకుంటుంటే వీళ్ళు నోటికి తింటున్నది అన్నమా గడ్డియా మరొకటా అనిపించి కమ్యునిష్టులంటే ఉన్న అసహ్యం రెట్టింపయ్యింది.

     హరప్పా,మొహంజదారో శిధిలాల్లో పశుపతి విగ్రహాలు దొరికిన దాన్ని బట్టి చూస్తే ఉత్తర దక్షిణ భారతాల్లోని ప్రజలందరికీ ఆదిదేవుడైన శివుణ్ణి పూజించే లింగాయతుల్ని హిందూమతం నుంచి వేరు చేసి హిందువుల మీదకి ఉసిగొల్పాలని చూస్తున్నారంటే వీళ్ళెంత క్రూరులో అర్ధం అవుతున్నది గద!నిన్నటి రోజున ఆర్య-ద్రవిద సిద్ధాంతాన్ని వండివార్చిన  రొమిల్లా ధాపర్ ఇవ్వాళ  కుర్రాళ్ళు ముఖం మీద వుమ్ముతుంటే నత్తి మాటలు మాట్లాడి తప్పుకునే దిక్కుమాలిన స్థితిలో నిలబడింది,ఒకప్పుడు శైవులూ వైష్ణవులూ కొట్టుకు చచ్చారు అని హిందూమతంలో తప్పులు పట్టి వీరంగాలు వేసిందీ వీళ్ళే!ఇప్పుడు లింగాయతుల్నీ హిందువుల్నీ విడదీసి కొట్టుకు చచ్చేలా చెయ్యాలని చూస్తున్నదీ వీళ్ళే!రేపటి రోజున లింగాయతుల పేరుతో కూడా ముఖం మీద వుమ్మేయించుకోవటానికి బయల్దేరినట్టున్నారు.ఘోరంగా దెబ్బతింటారు - కేదార్ నుంచి రామేశ్వరం వరకు లెక్కపెడితే వైష్ణవాలయాల కన్న శివాలయాలే ఎక్కువ,శివభక్తులకి కోపం వస్తే వాళ్ళు వీరభద్రులే అవుతారు,వాళ్ళు రెచ్చిపోతే దక్షాద్గ్వరమే,మళ్ళీ లేవకుండా కమ్యునిజం చచ్చిపోతుంది!

     విష్ణుమూర్తికి ఆలయం చెక్కాలంటే సాలగ్రామ శిలని తెచ్చి స్థపతుల వంటి ప్రత్యేక పాండిత్యం గల వ్యక్తులు మాత్రమే విగ్రహరూపకల్పన చేసేవాళ్ళు.వారు కూడా తంత్రశాస్త్రం, స్థలస్వభావం, ఆలయనిర్మాత జాతకలక్షణం వంటివి గణించుకుని తయారు చేస్తారు.శివాలయానికి అవేవీ అక్కర లేదు నల్లదో తెల్లదో ఒక రాయిని కొంచెం నునుపు దేల్చితే చాలు శివలింగం తయార్!ఆ నిరాడంబరత్వమే శివుణ్ణి హిందువులకి మరింత ప్రీతిపాత్రం చేసింది.శివుడికీ ఈ భూమికీ ఉన్న అనుబంధం ఏమిటో గానీ ప్రాచీన కాలపు శివాలయాల్లో చాలామటుకు స్వయంవ్యక్త క్షేత్రాలే.తెలుగువాళ్ళు తమిళనాడు నుంచి విడిపోవటం రాజకీయ కారణాల వల్ల జరిగింది కానీ ఆధ్యాత్మికంగా ఒకప్పటి మేధావులు "కన్యాకుమారి నుండి తిరువేంగడం వరకు విస్తరించి ఉన్న భూమి జగతః పితరులైన శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనది!" అని తీర్మానించారు.తెలుగు తమిళ ఆధ్యాత్మిక వేత్తలు పరిశోధించి ఒక ఉద్యమ ప్రయత్నంతో అప్పటి రాజుల్ని ఒప్పించి కట్టించిన పంచభూత లింగ క్షేత్రాలలో మూడు ఇప్పటి తమిళనాడు రాష్ట్రంలోనూ రెండు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నాయంటే వీరి మధ్య సంస్కృతిపరమైన ఏకత్వం ఎట్లా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు!
Srikalahati – Srikalahasti Temple (13.749802, 79.698410)
Kanchipuram – Ekambareswarar Temple (12.847604, 79.699798)
Chidambaram – Nataraja Temple (11.399596, 79.693559)
     వీటిని కట్టిన కాలాలు వేరు వేరు,దూరాలు సరే సరి - అయినా వీటి గోపురాల లాంగిట్యూడ్ ఒకటే!భూకంపాలు గానీ, వరదలు గానీ,మ రే భీబత్సమయినా ఈ ఆలయాల అమరికని మాత్రం మార్చడం లేదు - ఎట్లా సాధ్యం?ఇవి మూడు పంచభూత క్షేత్రాలు - శ్రీకాళహస్తి వాయులింగం, కాంచీపురం పృధ్వీలింగం, చిదంబరం ఆకాశలింగం.విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడూ విభిన్నమైనవి కావు,వీటి మధ్య సంబంధం ఉంది అని చెప్పడానికి దైవం తనంతట తానే ఒక్కో చోట ఒక్కో మూర్తిగా వ్యక్తం కావడమే తప్ప మనుషులు కూడబలుక్కుని కట్టినవి కాదు!మనుషులు ఆలోచించుకుని చెయ్యాల్సి వస్తే అన్నింటినీ ఒకేసారి కట్టేచాళ్ళు కదా!గాలీ, నిప్పూ, నీరూ, భూమీ, ఆకాశం అనేవాటిని ఆయా క్షేత్రాలలో విగ్రహరూపంలో ప్రతిష్ఠించి తమ ప్రార్ధనలతో ప్రసన్నం చేసుకుని మానవాళికి క్షేమాన్ని చేకూర్చడమే ఆలయనిర్మాతల ఉద్దేశం తప్ప కొబ్బరిచ్గిప్పల వ్యాపారం చేద్దామని కాదు.వ్యాపారమే వాళ్ల లక్ష్యమయితే అసలు ఆలయాల్ని కట్టాల్సిన పనేమిటి?మయసభనో ఇంద్రసభనో తలదన్నే వేశ్యావాటికలనో భోగమందిరాలనో కట్టి ఉండేవాళ్ళు!

     పంచభూత క్షేత్రాల ఏర్పాటులో ఈ భూతపంచకాన్ని విడివిడిగా ప్రసన్నం చేసుకోవడానికి ఏది తగిన స్థలం అని వెదకడంలోనూ విగ్రహ రూపకల్పనలోనూ మానవ ప్రమేయం కొంతవరకు ఉన్నది గానీ జ్యోతిర్లింగ క్షేత్రాలు మాత్రం పూర్తి స్వయంవ్యక్త మూర్తులు కొలువున్న మహిమాన్విత క్షేత్రాలే!అక్కడ విగ్రహస్థాపన అంటూ ఉండదు,స్వయంవ్యక్తమైన ఆ మూర్తి చుట్టూ ఆలయం నిర్మించడమే జరుగుతుంది.అలా ఇప్పటికి స్వయంవ్యక్తమైన జ్యోతిర్లింగాలలో ఒక పన్నెండింటిని విశిష్టమైనవిగా గుర్తించి అన్నింటినీ ఒకే జన్మలో ఎవరూ దర్శించలేరు గాబట్టి ఆ ద్వాదశ జ్యోర్తిర్లింగాలను దర్శించుకోగలిగితే సకల జ్యోతిర్లింగ దర్శన ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
     ఈ పన్నెండింటిని ఇలా చుక్కలు పెట్టుకుని చూస్తే అసలు రహస్యం తెలియదు,ఏదో చెల్లా చెదరై పడిన ముత్యాల మాదిరి కనిపిస్తాయేమో కొంచెం భావావేశం ఎక్కువ ఉన్నవాళ్ళకి.ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రని కూడా దూరాలని బట్టి వరస ఏర్పాటు చేసి ఉంటారు.కానీ అసలు రహస్యం తెలియాలంటే చూడాల్సిన వరస ఇది:
1.ఘృష్ణేశ్వర లింగం(khuldabad,Maharashtra)
2.త్రయంబకేశ్వర లింగం(nasik,Maharashtra)
3.ఓంకారేశ్వర లింగం(mandhala, Madhya Pradesh)
4.భీమశంకర లింగం(bhimasankar, Maharashtra)
5.మహాకాళేశ్వర లింగం(ujjain, Madhya Pradesh)
6.సోమనాధ లింగం(veraval, Gujarat)
7.మల్లికార్జున లింగం(srisailam, Andhra Pradesh)
8.విశ్వనాధ లింగం(vaaranaasi, Uttar Pradesh)
9.నాగేశ్వర లింగం(daarukaavanam, Gujarat)
10.రామనాధ లింగం(rameshvaram, Tamil Nadu)
11.వైద్యనాధ లింగం(deogarh, Jharkhand)
12.కేదారనాధ లింగం(kedarnath, Uttarakhand)
     ఘృష్ణేశ్వరం నుంచి మొదలుపెట్టి వరస తప్పకుండా కేదారనాధ్ వరకు గీతలతో కలిపి చూస్తే మీరు హిందువులైతే పులకించి పోతారు,హిందూద్వేషులైతే కంగారు పడతారు - అది ఖాయం!
     Fibonacci Spiral అచ్చు గుద్దినట్టు దిగిపోయింది గదూ!సృష్టిలో ప్రతిదీ కొలిచినట్టు జరుగుతున్నది,ఆ లెక్కని పటుకోలేకపోవడం వల్ల పాశ్చాత్యులు కొన్ని దృగ్విషయాలని random existence అంటున్నారు,మరి కొన్నిటిని probability constansts కింద తేల్చి పారేస్తున్నారు.కానీ భారతీయ విజ్ఞాన శాస్త్రం మొత్తం వెతికినా యెక్కడా ఈ రెండు పాయింట్లకీ ప్రాధాన్యత లేదు.సృష్టి రచన లోని గణితాన్ని మనవారు అనితరసాధ్యమయిన స్థాయిలో అర్ధం చేసుకోగలిగారు, తమకోసం ఉపయోగించుకోగలిగారు, ఇతరులకి నేర్పారు, అందరి నుంచి గౌరవాలు అందుకున్నారు!

     ఒకనాటి వైభవం ఏమైపోయింది?మళ్ళీ ఈ దేశం ప్రపంచ సంపదలో మూడో వంతు గానీ,నాలుగో వంతు గానీ సృష్టించుతూ తల యెత్తుకుని నిలబడగలుగుతుందా?సర్పిలాన్ని మొదటి నుంచి చివరి వరకు మరి కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే జవాబు కూడా ఇక్కడే కనిపిస్తుంది.విహంగదృష్టితో చూసి గీసిన ఈ సర్పిలంలో ప్రతి రెండు ఆలయాలకీ మధ్య దూరం Fibonacci ratio ప్రకారం పెరుగుతూ పోవాలి,కానీ 10వ రామనాధ క్షేత్రం,11వ వైద్యనాధ క్షేత్రం,12వ కేదారనాధ క్షేత్రం దగ్గిర లెక్క తప్పినట్టు లేదూ!ఇప్పుడు 11వ వైద్యనాధం గురించి మర్చిపోయి రామనాధ క్షేత్రం నుంచి సరాసరి కేదారనాధ క్షేత్రం వరకు గీతని పొడిగిస్తే ముందరి,ఇప్పటి ఆలయాల దూరం యొక్క నిష్పత్తి దాదాపు సరిపోతుంది!మరి,అప్పుడు కేదారనాధ క్షేత్రం 11వది అవుతుంది,పన్నెండవ క్షేత్రం ఎక్కడ ఉంది?

     కేదారనాధ క్షేత్రం నుంచి మక్కాలోని కాబాగుడి వరకు గీతని కొనసాగిస్తే జవాబు దొరుకుతుంది!బేను అబద్ధం చెప్పటం లేదు,ఇది అభూతకల్పన కాదు - లెక్కంటే లెక్కే.కాశీ ఆలయచరిత్రలో కూడా ఇలాగే జరిగింది.కాశీ మహాదేవుడి ఆలయాన్ని కూలగొట్టిన కొద్ది కాలానికే మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయింది,ఎన్నో రాజ్యాలు అంతరించిపోయినాయి గానీ ఔరంగజేబు వల్ల మొఘల్ వంశీయులు తమ వారసత్వం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడిన దయనీయమైన దుస్థితి దాపరించింది - సాక్షాత్తూ ఔరంగజేబు తను చేసిన పాపాల్ని తలుచుకుని ఆఖరి రోజుల్లో అలమటించి మరణీంచాడు!రాజ్యం చిల్లరమల్లర నవాబుల పాలన బడింది.కాశీ ప్రాంతం 70 యేళ్ళ క్షామాన్ని చూసింది.

     ఇక తట్టుకోలేక  అప్పట్లో ఇటువంటి విషయాల్లో ఆరితేరిన ఒక పండితుణ్ణి సంప్రదించారు.ఆయన మహాదేవుడి ఆలయం మళ్ళీ నిర్మించనిదే పరిస్థితి మెరుగుపడదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.ఆయన ప్రతిభ తెలియడం వల్ల ముస్లిములు కూడా విషయం అర్ధం చేసుకుని నవాబు గారిని కలిసి ఆలయపునర్నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు.అడుగుతున్నది ముస్లిములు గనక కాదనలేదు గానీ ఆలయనిర్మాణం పూర్తయి ప్రార్ధనలు మొదలైన వెంటనే  వర్షాలు పడకపోతే కట్టిన ఆలయాన్ని మళ్ళీ కూల్చేస్తాననే షరతు పెట్టి ఒప్పుకున్నాడు.అప్పటి చరిత్ర ప్రకారం కట్టిన వెంటనే నవాబు గారు కూల్చిన దాఖలాలు లేవు గనక అనుకున్న సమయానికి వర్షాలు పడి మహాదేవుడి మహత్వం రుజువైందనే అనుకోవాలి,అవునా?

     ఇప్పుడు జరుగుతున్న కధ కూడా అలాగే ఉంది.మక్కేశ్వరుడికి  నిత్యాభిషేకాలు ఆగిపోవడం వల్లనే 1400 యేళ్ళ నుంచి ప్రపంచం అశాంతికి గురవుతున్నది.తిరిగి మక్కాలోని కాబాగుడిలో వేదఘోష ఎప్పటినుంచి వినిపిస్తుందో అప్పటినుంచి ప్రపంచ ప్రజలు గుండెల మీద చెయ్యేసుకుని నిద్ర పోగలుగుతారు.


ఓం నమో భగవతే మక్కేశ్వరాయ నమః

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...