Tuesday 19 January 2016

అప్పుడు మన దేశంలోనే బ్రిటిషర్లు తమ క్లబ్బుల్లోకి కుక్కలతో కలిపి రానివ్వలేదు, ఇప్పుడు అమెరికా వాడు కుక్కల్ని తరిమినట్టు వెనక్కి తరిమాడు - అయినా సిగ్గు పడడం లేదు మనం!

      గత ఏదాది దిశెంబర్ 29,30వ తేదీలలో అయిర్ ఇండియా విమానంలో అమెరికా వెళ్ళిన 15 మంది తెలుగు విద్యార్ధులు అమెరికా లోని నార్త్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ అనే రెండు యూనివర్శిటెలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు అమెరికన్ అధికారులు."ఎందుకు?" అని విద్యార్ధులు ప్రశ్నిస్తే తుపాకీలు గురిపెట్టి బెదిరించారు.ఉగ్రవాదులకు వేసినట్టు చేతులకు బేడీలు వేసి గంటల కొద్ద్దీ విచారణ పేరుతో భయానక వాతావరణం సృష్టిస్తే పాపం భయంతో బిక్కచచ్చిపోయి ఎన్నో ఆశలతో అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన వారంతా నిరాశగా తిరిగి వచ్చేశారు.అమెరికా చదువు కోసం తాహతుకు మించి పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా!

      పైకి బ్లాక్ లిస్ట్ అయ్యాయని సాకులు,లోపల మరేవో తీరులు."ఇండియన్ డాగ్స్ వస్తున్నా"యంటూ అవహేళనలు మరింత దారుణం!అసలు బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్శిటీల నుంచి ఇక్కడికి "I20"లు ఎలా వచ్చాయి?మన దేశపు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు చిలక పలుకులు వల్లించటం తప్ప స్వంతంగా విషయం కనుక్కోవడానికి గానీ విద్యార్ధులకు అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి గానీ ఏమీ చెయలేదు.విద్యార్ధులు తప్పులు చెయ్యడం వల్లనే వెనక్కి పంపించామంటున్న అమెరికా ప్రభుత్వం భారత ప్రబ్భుత్వానికి అవి ఎలాంటి తప్పులో తెలియజేసిందా?I20, అమెరికా ప్రభుత్వం ఆమోదించిన వీసా,అన్ని పత్రాలూ ఇక్కడ చెక్ చేసి పంపించాక కూడా ఆఖరి నిమిషంలో చేసిన భీబత్సం వెనక ఉన్న గందరగోళం కధేమిటి?అమెరికా ప్రభుత్వం యొక్క బ్లాక్ లిస్టులో ఉన్న యూనివర్శిటీల నుంచి I20లు భారత్ లోని విద్యార్ధులకు ఎలా వచ్చాయనే దానికి తమ వైపున ఉన్న లొసుగులు కూడా కారణం కదా, ఏకపక్షంగా విద్యార్ధులనే నేరస్థులుగా నిలబెట్టి ఉగ్రవాదుల్ని విచారించినట్టు సంకెళ్ళు వేసి అనాదరణ చూపించడం దేనికి చేశారు - అడిగేదెవ్వరు?

      మన దేశ ప్రజల్లో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది.తెలివితేటల్లో మనవాళ్ళు అఖండమైన వాళ్ళు,ఎక్కడ నిలబెట్టినా శిఖరాగ్రం చేరుకోగలరు - కానీ నిలబడకూడని చోట నిలబడతారు.తామెక్కడ నిలబడితే తమ శక్తియుక్తులు సహజ పద్ధతిలో వికసిస్తాయో తెలుసుకోరు!ఒకడెవడో ఫలానా దేశంలో ఫలానా ఉద్యోగం చేసి లక్షలు కూడబెడుతున్నాడు అని తెలియగానే గుడ్డెద్దు చేలో పడినట్టు పొలోమని వాణ్ణి అనుకరించి వాడిలాగే మనమూ జాక్పాట్ కొట్టేద్దాం అనే దురాశతో ఎండమావుల వంటి అవకాశాల కోసం విలువైన కాలాన్ని వ్యర్ధం చేసుకుని అదీ దక్కక తమ అసలైన ప్రతిభని సానబట్టుకోలేక రెంటికీ చెడుతున్నారు!

      ఇవ్వాళ్టి అమేరికా ఒకప్పటి అమెరికా లాగ లేదు,ఇంకెంతో కాలం అది భూతలస్వర్గం హోదాని నిలబెట్టుకోలేదు.ఇప్పటికే ఉద్యోగ కల్పన విషయంలో ఎక్కడెక్కడి వాళ్ళూ అక్కడికే పరుగులు పెట్టడం వల్ల విపరీతంగా ఉబ్బిపోయి పగలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ మీద ఇంకా ఆశపడి ప్రయోజనం లేదు!వాళ్ళ ఆలోచనా ధోరణులు కూడా కర్కశంగా మారడం సూచనాప్రాయంగా తెలుస్తున్నది.అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నోటికేది తోస్తే అది మాట్లాడుతున్నాడు, బ్రిటిష్ ప్రధాని కామెరూన్ లండనులో ఉండాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే అంటున్నాడు!పైకి క్లీన్ షేవ్డ్ మొహాలతో త్రీ పీస్ సూట్లతో  చెక్కు చెదరని నవ్వుల్తో పెదవి చివరి మర్యాదల్తో టైలర్ మేడ్ జంటిమన్లుగా కనబడుతున్నా వాళ్ళంత జాత్యహంకారులు ఈ భూప్రపంచం మీద ఇంకెవ్వరూ లేరు.వాళ్లకి పాప్యులారిటీ కూడా పెరుగుతున్నది, అంటే ఈ ట్రెండు తగ్గే సూచనలు నాకైతే కనబడ్డం లేదు!

      భారతీయులు చిన్నప్పుడు మనం చదువుకున్న మూడు చేపల కధలో మొదటి చేపలా వ్యవహరించే కాలం దాటిపోయింది,కనీసం రెండవ చేపలా అయినా వ్యవహరిస్తారా!ఒక రూపాయి ఖర్చుతో పది రూపాయలు సంపాదించాలంటే కండల్ని కరిగించి శ్రమించాలి, ఒక రూపాయి ఖర్చుతో వంద రూపాయలు సంపాదించాలంటే తెలివిగా వ్యాపారం చెయ్యాలి,ఒక రూపాయితో కోటి రూపాయలు సంపాదించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవాలి,ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అష్టైశ్వర్యాలు దక్కాలంటే ముదనష్టంగానే రావాలి - భారతీయులు దేన్ని కోరుకుంటున్నట్టు?మెకాలే తమ ప్రభుత్వపు అవసరం కోసం ప్రవేశపెట్టిన క్లర్కుల్నీ ఉద్యోగుల్నీ మాత్రమే తయారు చెసే విద్యా విధానం గురించి గానీ ఇంగ్లీషు భాష గొప్పదనం గురించి గానీ చింకి లెక్చర్లు దంచే మేధావులు వీలయినంత త్వరగా తమ భ్రమల్ని వదిలించుకుంటే దేశానికీ యువతకీ భవిష్యత్తుకీ చాలా మంచిది!మితిమీరిన ఆంగ్లభాషావ్యామోహంతో ఉన్న ఈ మేధావులు మాతృభాషలో విద్యాబోధన యొక్క సానుకూలతల్ని గుర్తించలేకపోతున్నారు.ఇంగ్లీషు పట్ల వ్యామోహాన్ని వదిలేసి మొదట మాతృభాషని క్షుణ్ణంగా నేర్చుకుంటే దానితో అనుసంధానం చేసుకుని ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రాన్సు వెళ్ళవచ్చు,జర్మన్ నేర్చుకుంటే జర్మనీ వెళ్ళవచ్చు,జపనీస్ నేర్చుకుంటే జపాన్ వెళ్ళవచ్చు - పపంచం నలుమూలలకీ విస్తరించగలిగే అవకాశం వస్తుంది!సంస్కృతుల పరంగా చూసినా భారతీయ సంస్కృతి పట్ల గౌరవం అమెరికాలో కన్నా పై దేశాలలోనే ఎక్కువ.మనకి గౌరవం దక్కే చోటుకి పోకుండా మనని అవమానించే చోటుకి ఎందుకు వెళ్ళటం?

      మన దేశంలోని కుల వ్యవస్థలో ఒక తమాషా ఉంది.తాము కింది కులాల వాళ్ళ కన్న అధికులం, తెలివైన వాళ్ళం,సంస్కృతి కంతా పట్టుగొమ్మలం అనుకునే ఉన్నత కులాల వారే మొదటి రోజు నుంచీ చివరి రోజు వరకూ ఇంగ్లీషు వాళ్ళకి వూడిగం చేశారు!ఇంగ్లీషు వాళ్ళు తమలో తాము క్లబ్బులు పెట్టుకుని "DOGS AND INDIANS ARE NOT ALLOWED" అని బోర్డులు పెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా ప్రతిస్పందించ లేదు ఈ విజ్ఞాన తేజోరాశులైన బ్రాహ్మణ శ్రేష్టులూ పౌరుషం మూర్తీభవించిన రాజాధిరాజులూ!ఈ బోడి సత్యాగ్రహాలకి స్వతంత్రం రాదనుకుని ఆఖరు నిముషం వరకూ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లీషువాళ్లకి మిత్రులుగా గడిపి ఇంక స్వతంత్రం వచ్చేస్తుందనుకున్న వెంఠనే ముందుకు దూకి అధికార మార్పిడిలో తామే పైన ఉండేలా చూసుకున్నారు - కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్య చేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు అని వేమన్న వూరికే అన్నాడా!ఇప్పటి దళిత మేధావులు కూడా నిన్నటి రోజున ఆ అగరవర్ణాల వారు ఏమి చేశారో అదే పద్ధతిని పాటిస్తూ వారినే ఇమిటేట్ చేసి వారి స్థానంలోకి వెళ్ళడానికే చూస్తున్నారు తప్ప తమకంటూ సొంతదారిని వెతుక్కుని ముందుకు వెళ్ళగలిగే కీలకం గ్రహించటం లేదు.ఇప్పటికీ ఉద్యోగాల మార్కెట్టులో సింహభాగం ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఉన్న మంచి స్కూళ్ళలో కాలెజిలలో చదువుకుని వచ్చే డబ్బున్న అగరవర్ణాల పిల్లలదే హవా!వారితో పోటీ పడాలంటే వారికంటే మరింత వేగంగా కదిలితేనే గానీ వారికన్నా ముందుకు పోవటం సాధ్యపడదు కింది కులాల నుంచి కొత్తగా పోటీలో ప్రవేశిస్తున్న వాళ్ళకి!అదే,మాతృభాషలో చదువుకోవడం వల్ల ఈ అధికశ్రమ అవసరం ఉండదు,ఒత్తిడి ఉండదు,వెనుకబాటు తనమూ ఉండదు!

      మొత్తం ప్రాధమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి.తర్వాత ఇప్పటిలా మూడు నాలుగు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు,సెకండ్ లాంగ్వేజిగా హిందీ,ఇంగ్లీష్,జపనీస్,ఫ్రెంచ్ లాంటివాటి కన్నిటికీ ఒకే రకం ప్రాధాన్యత ఇచ్చి విద్యార్ధుల్ని ఏదో ఒక్కటి మాత్రమే తీసుకుని అందులోనే ప్రావీణ్యత సంపాదించమంటే సరిపోతుంది.అప్పుడు ఆ ఒక్క భాషనీ మాతృభాషతో అనుసంధానించి నేర్చుకుంటే ఆ భాషతో ఎక్కడ నెగ్గగలిగీతే అక్కడికి వెళ్ళే విధంగా విద్యార్ధుల్ని తీర్చిదిద్దితే తప్ప ఒక్క ఇంగ్లీషునే నేర్చుకోవడం ఇంగ్లీషు పనికొచ్చే చోటనే అందరూ గుమిగూడటం అనే దరిద్రం పోయి మనవాళ్ళు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడయినా నెగ్గుజురాగలిగే విధంగా తయారవుతారు.ఇది సాంకేతికంగా కూడా విద్యార్ధుల మనస్సు మీద పోటీకి సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది,మౌలికంగా దేశపు సంస్కృతి పట్ల గర్వాన్ని పెంచుతుంది.ప్రభుత్వాలకి కూడా ఉపాధి కల్పన ఇప్పటిలా రొడ్డకొట్టుడుగా చేసి భంగపడకుండా కొత్తదారుల్ని వెతికే ఉత్సాహాన్ని ఇస్తుంది.మనం ప్రపంచానికి తిట్టించుకుని వెనక్కి వచ్చే అసమర్ధుల్ని గాక ఎక్కడి కెళ్ళినా అక్కడివాళ్ళు కళ్ళకద్దుకుని స్వీకరిస్తూ మన దేశపు సంస్కృతికి దర్పణాలుగా నిలిచే దమ్మున్న కుర్రాళ్లని సమర్పించాలి!"I am a westerner with a deep respect for your vedantic philosophy.It pains me to see the erosion of sanatana dharma in Bharat.You must keep these values alive because it is the only hope for our entire planet!When all righteousness dies in the world,We will have to live in calamities. I can see the effects of adharmic living in the west,loss of meaning,depression,addiction,materialism and suicide!Use your innate indian intelligence to see where western values will ruin india just as they are corrupting the whole world.Even the things you crave that are shown in the westernmedia are not real.We are not glamorous,educated,sexy,people like the media shows.Come to the west and you will see lonliness,despair and terrible poverty as well!Hollywood is a propaganda machine  for the west and does not show the truth.The truth is a society that is ruled by greed and lust and is consuming all its treasures to become an ugly place of sterile parking lots and megastores.We go to india to find relief from the depression and ugliness here. In india people are still alive while in the west we are slowly becoming vegetables in front of our electronic devices.hold on to your values and have faith that india's value is its values!"  - ఇది Rose Kerekes అనే ఒక విదశీ వనిత భారతీయులకి ఇస్తున్న సలహా, ఎంత చక్కగా చెప్పింది!

      కానీ మన దేశంలోని వాతవరణం చూస్తే ఇప్పట్లో ఆ దిశగా అడుగు పడుతుందనే ఆశ నాకేమాత్రం కలగడం లేదు."జాతుల్సెప్పుట,మృషల్ సంధించుట,అన్యాయ విఖ్యాతింబొందుట,కొండెకాడవుట - అన్నియు పరద్రవ్యంబు నాశించి" అని ఒక కవిగారు ఇవ్వాళ మనవాళ్ళు చేస్తున్న వెధవ పనులన్నిట్నీ కూలంకషంగా వర్గీకరించి మరీ చెప్పాడు!నీ జాతి వేరు వాడి జాతి వేరు వాడు నిన్ను దోచుకు తినాలని చూస్తున్నాడు నువ్వు వాడితో కలవకు అని ఎవరు చెప్పినా 90 శాతం మందిని ఒక్కటిగా కలవనివ్వకుండా కలిసి ఆలోచించనివ్వకుండా కన్ఫ్యూజ్ చెయ్యటానికీ,వాళ్ళనా కన్ఫ్యూజన్ లోనే ఉంచి వాళ్ళమీద అధికారాన్ని 10 శాతం మాత్రమే ఉన్న తమ దగ్గిరే ఉంచుకోవటానికీ, ఆ అధికారాన్ని ఉపయోగించుకుని మందిసొమ్మును దిగమింగటానికీ మాత్రమే చేస్తారు.తనకి 100 కోట్లు విలువ చేసే కాంట్రాక్టును దఖలు పరిస్తేనే అక్కడి అధికారికి ఒక కోటిని మృషగా సంధిస్తారు.తమకు లేని గొప్పదనాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే ప్రబుద్ధులు ఆ పని వూరికే చెయ్యరు - చాటుగా ఆ పేరుని సొంత సంపాదనకి ఉపయోగించుకుంటారు.వాడు మంచివాడు కాదని పక్కవాడి గురించి పైవాళ్ళకి కొండేలు చెప్పేవాళ్ళు అవతలి వాడికి పైవాళ్ళు ఇచ్చేదాన్ని తమకి ఫిరాయించుకోవడానికే ఆ పని చేస్తారు.ఇవన్నీ చెప్పి "ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో శ్రీ కాళహస్తీశ్వరా!" అని నిట్టూర్చాడు.అలా నిట్టూర్చడంలో స్వామీ నాకు మాత్రం ఆ పాడుబుద్ధులు కలగనియ్యకు అని వేడుకోవడం ఉంది!ఎందుకంటే పైన చెప్పిన వెధవపనులు నిన్నటిరోజున చేసినవాళ్ళు ఇవ్వాళ్టిరోజున చేస్తున్నవాళ్ళు రేపటిరోజున చేసేటివాళ్ళు  ఎవరో ఎక్కడుంటారో ఎలా బతికారో ఎప్పుడు చచ్చారో ఎవరికీ తెలియదు.కానీ కొందరు ప్రాతస్మరణీయుల్ని దేశకాలప్రాంతభాషాదుల్ని పట్టించుకోకుండా గుర్తుంచుకుంటున్నామే, వాళ్ళు మాత్రం అట్లాంటి వెధవ పనులు చెయ్యకుండా మరో విధంగా బతకడం వల్లనే మనకి గుర్తుకొస్తున్నారు - అయితే ఇవ్వాళ వాళ్ళే నిజమైన మైనార్టీ అయిపోయారని తెలిస్తే చాలా నిర్వేదంగా ఉంటుంది?!

      పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది,తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది.టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు.మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు.

ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు - నేను నిర్వేదం అని చెప్పాను!

18 comments:

  1. ఏమిటో ఈ గందరగోళం?

    భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాల్ని కొనసాగించటం అంటే వెయ్యి మంది యాకూబ్ మెమన్లని పుట్టించటమా?

    ఒక ఉగ్రవాదిని మహనీయుణ్ణి చెయ్యాలనే దుడుకుతనాన్ని అడ్డుకుంటే గదుల్లోకి చొరబడి తన్నబోవటం అహంకారమా వెనుకబాటు తనమా?

    ఆత్మహత్య చేసుకున్న ప్రతివాడూ దళితుడేనా?ఉరి తియ్యబడ్డ ప్రతివాడూ అమరవీరుడేనా?అయితే యాకూబ్ మెమన్ పేరుతో అభిమాన సంఘాలు పెట్టడం,అతన్ని కూడా అంబేద్కర్ సరసన నిలబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.

    అది కూడా చేస్తే శుద్ధక్షవరం లాంటి పతనంలో ఆఖరి దశ కూడా పూర్తవుతుంది!

    అంబేద్కర్ ఆత్మ ఇప్పుడు ఆనందిస్తున్నదా క్షోబిస్తున్నదా పశ్చాత్తాప పడుతున్నదా!

    ReplyDelete
  2. మీరు ఇక్కడ ఉదహరించిన మాటలు Rose Kerekes ప్రస్తావించిన పుస్తకం పేరు తెలుపగలరా? థాంక్స్.

    ReplyDelete
    Replies
    1. ఆవిడ రచయిత్రి కాదు,ఏ పుస్తకంలోనూ రాయలేదండి!ఒకానొక ఇంగ్లీషు బ్లాగులో బ్లాగరు మన దేశపు శాస్తజ్ఞుల గురించీ వారి ఆవిష్కరణల గురించి చెబితే ఆమ అలా స్పందించి కామెంటు వేశారు.ప్రముళులే కాదు విదేశాల్లో సామాన్యులకి కూడా భారతదేశం గురించి తెలుసు,మన దేశం అంటే అభిమానం ఉంది!చాలా చోట్ల చాలామంది ఇదే విధంగా కీర్తిస్తున్నారు.ఇంగ్లీషువాళ్ళు చెప్పిన అబద్ధాలనే నమ్ముతూ నిజమేమిటో తెలుసుకోకుండామనవాళ్ళు మన దెశాన్ని తిట్టుకుంటున్నారు గానీ ఇలాంటివారు ప్రపంచమంతటా ఉన్నారు!

      వేముల రోహిత్ బ్యాగ్రౌండ్ చూదంది హిందువై పుట్టి కూడా హిందూత్వాన్ని మూర్ఖంగా ద్వేషించి ఏబీవీపీ బ్యానర్లు చింపి పోగులు పెట్టి కాషాయం ఎక్కడ కనిపించినా చింపుతాను అని ఎందుకో తెలియని కసితో రగిలిపోతూ యాకూబ్ మెమన్ ఉరికి వ్యతిరేకంగా ఆందోలనలు చేసి అడ్డుకున్న సుశీల్ కుమార్ అనే అతన్ని చావ చితక్కొట్టినా ఎవరికీ అతనిలో తప్పులు కనబడటం లేదు,ఆత్మహత్యతో సానుభూతి కూడా పుష్కలంగా వస్తున్నది - మరో పదిమదికి ప్రోత్సాహం ఇస్తున్నారు పొలిటీషియన్లు!

      Delete
    2. రోహిత్ తాను పుట్టిన హైందవ మతాన్ని తిరస్కరించాడు. మీరు ఉదహరించిన రోజ్ అనే ఆవిడ తాను పుట్టిన క్రైస్తవాన్ని వదిలేసుకుంది. ఇద్దరు చేసింది ఒకటే: ఫలానా మతంలో పుట్టాను కాబట్టి దాన్నే పట్టుకు ఉండాలనే వాదనను వదిలేసి తమ మేధా పరిధిలో సదరు 'జన్మసిద్ధ" మతాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం.

      Delete
    3. @jai
      ఆవిడ తాను పుట్టిన క్రైస్తవాన్ని వదిలేసుకుంది.

      haribabu:
      ఆమె తన మతాన్ని వదిలేసుకుందా!ఆవిడ గురించి మీకిదివరకే తెలుసా?నాకు తెలిసి ఆ కామెంటులో తను క్రైస్తవాన్ని వదిలేసి హిందూ మతాన్ని స్వీకరించినట్టు యెక్కడా చెప్పలేదే?ఇండాలజీ అనే ఒక సైన్సు ఉంది,ఆ సైన్సుకి సంబంధించి వర్క్ చేసేవాళ్ళని ఇండాలజిస్టులు అంటారు.అందులో భారత దేశాన్ని గురించి పరిశోధనలు చేసి గొప్పగా చెప్పేవాళ్లంతా వాళ్ళ వాళ్ళ మతాల్ని వదిలేసి హిందూమతాన్ని స్వీకరించినట్టు అవుతుందా?

      అట్లా వేరేఅ దేశంలో పుట్టి వేరే మతాన్ని నిష్ఠగా పాటిస్తూ ఉన్న ఇండాలజిస్టులు భారతదేశం గురించి గొప్పగా చెప్పినా వాళ్ళు మతం మారిపోయినట్టేనా?

      Delete
    4. @jai
      రోహిత్ తాను పుట్టిన హైందవ మతాన్ని తిరస్కరించాడు.

      haribabu
      ఏబీవీపీ బ్యానర్లు చింపడం,కాషాయం నా కంటికి కనబదకూదదని ఆవేశపడిపోవతం,సుశీల్ కుమార్ అనే అతన్ని చావ చితక్కొట్టటం ఇవన్నీ కేవలం తిరస్కరించడమా?

      తను తనకిష్టమైన మతాన్ని వీకరించహ్డాన్ని తప్పని ఎవరయినా అంటున్నారా ఇక్కడ?సాగినంతకాల్మ్ రౌదీ పన్లు చెయ్యటం సాగకపోతే ఆత్మహత్య చేసుకుని సానుభూతి తెచ్చుకోవటం - మరి సుశీల్ కుమార్ వీళ్ళ దాడికి గురైతే దానికి ఈ స్పందన రావడం లేదేమిటి?ఆ దెబ్బలకి ముందుగా అతను చచ్చిపోయి ఉంటే ఒక హిందూ మతతత్వవాది తను చేసిన దుర్మార్గాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు,శిక్ష అనుభవించినట్టు అవుతుందా?

      Delete
  3. ఈ రోజ్ అనే ఆవిడ ఎవరో నాకు తెలీదు, మీ బ్లాగులోనే మొదటి సారి పేరు విన్నాను. మీరు ఉంచిన కోట్ చదివితే ఆమె హిందూ మతాన్ని స్వీకరించినట్టు అనిపిస్తుంది. బహుమత ఉపాసన క్రైస్తవంలో సమ్మతం కాదు కనుక ఆవిడ తాను పుట్టిన మతాన్ని వదిలేసిందని అనుకోవాలి.

    ఏబీవీపీ అనేది ఒక విదార్తి సంఘం. సుశీల్ కుమార్ ఆ సంఘంలో ఒకానొక నాయకుడు. దీనికి మతం రంగు అవసరం లేదు. బానర్లు చింపడం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం (కాంపస్) రాజకీయాలలో సర్వసాధారణం. I am not supporting it just stating facts. All sides indulge in such things.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. @jai
    దీనికి మతం రంగు అవసరం లేదు. బానర్లు చింపడం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం (కాంపస్) రాజకీయాలలో సర్వసాధారణం.

    haribau
    నేను అంటున్నదీ అదే లెండి!మామూలుగా జరిగే గొదవల్లో జరిగిన అతమహత్య అయినప్పుడు ఇనత్ అహ్డావిది ఎందుకు జరుగుతున్నట్టు?ఆతమహత్యని కూడా కుట్రపూరితమైఅన్ హత్యగా చిత్రీకరించితే ముద్దాయి యెవరు?హిందూ మతమే కదా!ఇక్కద మతం రంగు పులుముతున్నది ఎవరు?

    ReplyDelete
  6. * మన దేశంలోని కుల వ్యవస్థలో ఒక తమాషా ఉంది…..ఈ విజ్ఞాన తేజోరాశులైన బ్రాహ్మణ శ్రేష్టులూ పౌరుషం మూర్తీభవించిన రాజాధిరాజులూ!ఈ బోడి సత్యాగ్రహాలకి స్వతంత్రం రాదనుకుని ఆఖరు నిముషం వరకూ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లీషువాళ్లకి మిత్రులుగా గడిపి ఇంక స్వతంత్రం వచ్చేస్తుందనుకున్న వెంఠనే ముందుకు దూకి అధికార మార్పిడిలో తామే పైన ఉండేలా చూసుకున్నారు*



    చాలా కాలం గా పైన రాసిన దానికి సమాధానం రాద్దామనుకొన్నాను. నేటికి వీలుదొరికింది.బ్రిటీష్ సామ్రాజ్యం పై బ్రాహ్మణులు వీరోచిత పోరాటం సమయానుకూలంగా చేస్తూ వస్తూనే ఉన్నారు. కనుకనే బ్రిటిస్ తలారులు ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులు,అండమాన్ జైల్లో నరకయాతన అనుభవించిన 500మంది స్వాతంత్ర పోరాటయోధుల్లో సగానికి సగంవారే ఉన్నారు.

    సౌత్ లోబ్రాహ్మణుల పై నేడు చూస్తున్న ఈవ్యతిరేక భావజాలనికి కారణం జస్టిస్ పార్టి,DMK. పెరియార్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పాలించాలని చాలా బలంగా కోరుకొన్నాడు. జస్టిస్ పార్టిలో ఆయన మద్దతు దారులందరు భూ స్వామ్యులు, జమీందార్లే.




    The Truth About DMK by S. Mohan Kumaramangalam
    September 1, 1962

    http://www.mainstreamweekly.net/article3915.html

    ReplyDelete
    Replies
    1. నార్త్ లో సిపాయిల తిరుగు బాటు తదనంతరం జరిగిన పరిణామాల గురించి జరిగిన చర్చను ఇస్తున్నాను.

      1857 rebellion was not a failure.... It was a big success. British Army was kicked out of India and they were afraid of coming back due to wide-spread rebelion in British Indian Army. But, after kicking the Brits out, big question started to haunt: who will fill the vacuum of power? Big old Kings, Rajpoots, nababs, landlords were favouring Mughal King Bahadurshah and old feudal system of governance.

      " But, the real fighters in that war were Hindu Brahmins upper caste, who were sepoy in British Army. They wanted a french revolution kind of democratic system. "

      After announcement of Mughal King as ruler, these real fighters refused to accept it. When these discussions were going on, mughals spread the rumor that emperor has written a letter to King of Iran for help and Irani Army has been dispatched towards Delhi.. This was a very big rumor and spread very quickly in whole of Delhi.

      This rumor refreshed the atrocities commuted by "Nadirshah" and "Abdali". (However, it was not possible coz Persia became very weak in 1857 due to Anglo-Persian war). Later, to frighten and silence his opponents, Mughal officials confirmed this rumor as true in a big assembly of common people held in Chandni Chowk, Delhi. It created the major panic among commoners specially among hindus. Trust of people on muslim mughal leadership was broken.

      Delete

    2. Hindus Brahmin army sepoy thought that living under the rule of British is far better than these illitrate religious bigots.... Immediately some Hindus went to kolkatta and persued British Army to return from Singapore/Hongkong. Brtishers got new opportunity and support. By that time Bahadur Shah was announced as King and all the muslim Nawabs kept on supporting him in their religious zeal. Hindus separated themselves from all of this fanfare and started supporting British directly/indirectly(these were the same hindus, Who fought and kicked Brits a couple of months back).

      Brits came back and first task they did was to finish Mughal blood line, so that no mughal could claim Delhi again ever. After re-establishing Brit rule, first census was done and it was confirmed that Hindus are in majority and they wanted democratic system of governance, while muslims wanted autocratic feudal security state. Both got what they wanted after 1947.

      "This sequence of events of 1857" has been discretely mentioned by Jawahar Lal Nehru in his book "Discovery of India" but, hidden by later historians in their zeal to maintain hindu-muslim unity.

      Indian At that time it was decided that British will leave India after installing an effective system of governance. But, the fundamental differences between hindus and muslims couldn't be sorted out.


      " Muslims were adamant to feudal system of governance, while hindus wanted democratic system. This delayed the Indian independence by 90 long years. "

      Britishers took full advantage of these differences and even encouraged it further. Many people think that Congress suddenly agreed to partition of India for power in 1946. It was not true. In fact Nehru/Patel/Gandhi knew this history very well. They thought if they didn't accept it now(when Brits were very weak after WW-II) , Brits may stay here and consolidated their control after gaining the strength and support from other European/US.
      Decision was taken to make a model state with democratic system, so that common Indian muslims may find the merit in it and agree to merge after few years.

      Jinnah was lying on Aug 11 speech giving different perspective of Pakistan and all the muslim feudals/army generals/mullahs who supported him felt betrayed. Jinnah was sidelined and subsequently killed and Pakistan emerged as feudal Islamic security state. It was a 90 years long struggle of Mullahs/Nawabs (pro-genies of Islamic invaders), who were not ready to delegate their powers to common forced convert muslims (former hindus). This struggle is still continued in feudal Islamic security state of Pakistan till today.

      Delete
    3. The tale of partition , thus, reduces down to the following:

      1. Fear of Democracy - one person one vote - shown by Muslim Leadership

      2 . Use of violence for achieving political objectives legitimated

      3. Vested Feudal Interests Protection

      4. Protection of Vested interests of Princely States

      5. Eagerness with which communal partition was accepted by Gandhian Congress leadership - ostensibly to avoid further violence which had now become completely communal

      6. Personal political ambitions of actors involved.

      Delete
    4. Hari baabu, Read these articles also. You will get clear picture

      Smokers’ Corner: The mysterious ideologue on Jinnah’s left

      http://www.dawn.com/news/1183541

      Urdu-isation of Punjab

      http://tribune.com.pk/story/880483/urdu-isation-of-punjab/


      Suhrawardy & Liaquat Ali Khan

      http://tribune.com.pk/story/101025/suhrawardy-liaquat-ali-khan/

      Suhrawardy and Jinnah

      http://tribune.com.pk/story/97849/suhrawardy-and-jinnah/

      Delete
  7. The only solution to India’s problem, he asserted, was ‘to partition India so that both the communities could develop freely and fully according to their own genius.’


    http://www.thehindu.com/opinion/op-ed/creating-a-new-medina/article6296505.ece

    For Jinnah, Muslims in the ‘majority provinces’ were a nation with concomitant rights to self-determination and statehood since they constituted a numerical majority in a contiguous piece of territory. On the other hand, Sikhs, though distinct enough to be a nation, did not fulfill either of these criteria and hence were a sub-national group with no option but to seek minority safeguards in Pakistan. Jinnah specifically compared the position of Sikhs to that of U.P. Muslims. The U.P. Muslims, though constituting 14 per cent of the province’s population, could not be granted a separate state because


    “Muslims in the United Provinces are not a national group; they are scattered. Therefore, in constitutional language, they are characterized as a sub-national group who cannot expect anything more than what is due from any civilized government to a minority. I hope I have made the position clear.”


    Jinnah’s speech to the Muslim Students Federation at Kanpur a few weeks later went a little further causing a furore in the Urdu press in U.P. He declared that in order to liberate 7 crore Muslims of the majority provinces, ‘he was willing to perform the last ceremony of martyrdom if necessary, and let 2 crore Muslims of the minority provinces be smashed.’

    At the same time though, Jinnah tried to soften the blow for them by arguing that Pakistan’s creation would entail a reciprocal treaty with Hindu India to safeguard rights and interests of minorities in both states.

    ReplyDelete
    Replies
    1. మొదటి సాయుధ పోరాటం పూర్తిగ అవీజయవంతమవటం,వాళ్ళు పూర్తిగా దేసం దాటి వెళ్ళిన అత్ర్వాత కొందరు పనిగట్టుకుని మళ్ళీ ఇంగ్లీషు వాళ్ళని వెనక్కి తీసుకు రావటం - ఈ చరిత్ర అంతా నేనూ చదివాను.కానీ విభజన సమయంలో దాని చుట్టూ గుమిగూడి ఉన్న పై స్థాయి నాయకులలో మొత్తం నాలుగు రకాల్ అవాళ్ళు ఉన్నారు.హిందువులలో(రాజులా,బ్రాహ్మణులా,ఇతరులా అనే విబహజన అనవసరం.ఈ విభజనలు స్వాతంత్ర్యం అత్ర్వాత పుట్టిన వాళ్ళు ఇంగ్లీషువాళ్ళు రాసిన చారిత్రక ఇశ్లేషణల్ని బట్టి వేసిన లేబుళ్ళు తప్ప అప్పటి వాళ్ళలో ఈ తేడాలు లేవు) పాకిస్తాను ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు,స్వాగతించిన వాళ్ళు ఉన్నారు.అట్లాగే ముస్లిముల లోనూ విన్=బహజన్ అకోసం పట్టుబడుతున్న వాళ్ళూ,దాన్ని వ్యతిరేకించిన జాతీయవాద ముస్లిములూ ఉన్నారు!

      Delete
    2. ఈ చరిత్ర అంతా నేనూ చదివాను

      మీరు చదివిన పుస్తకాలు పేరు చెబుతారా? చర్చ జరిగినపుడు సోర్స్ అడగలేదు.

      అట్లాగే ముస్లిముల లోనూ విన్=బహజన్ అకోసం పట్టుబడుతున్న

      I did not understand above stmt. Cud you pls explain once again.

      Recently I came to know G.M. Syed. He met Mahatma Gandhi.

      The Case of Sindh G.M. Syed
      http://www.gmsyed.org/hiswork.html
      Please read
      The Case of Sindh
      G M Syed's deposition to the court.
      A comprehensive study of Sindh's case. A detailed argument showing how the Pakistani establishment has exploited Sindh and Sindhis.

      http://www.gmsyed.org/hiswork.html

      Delete
  8. ఏమయ్యారండి హరిబాబు గారు ఎక్కడా కన్పించట్లేదు? బ్లాగడం ఆపేశారేమో అనుకున్నాను

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...