Thursday, 20 October 2016

ఎవడ్రా వాడు?మీ హిందూమతంలో మా ఇస్లాము మతసారమే ఉంది,మీ శాస్తుర్లు తప్పు చెప్తున్నారని ఓక పీరుసాయిబు రచ్చ చేస్తున్నాడు - చెప్పు తెగుద్ది!

జనుల కెల్ల శుభము సాంఖ్య యోగము; దాని
వలన ధర్మనిష్టవలన నయిన
నంత్యకాలమందు హరిచింత సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర!

అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి
విధినిషేధ నివృత్తి సద్విమలమతులు
సేయుచుందురు హరిగుణచింతనములు
మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!

హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవనేర్చునె? వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!

ద్వితీయ స్కంధము : ధారణా యోగ విషయంబు
2-12-వ.
వినుము; నీకు నేడు దివసంబులకుం గాని జీవితాంతంబు గాదు; తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతం బగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు, నంత్యకాలంబు డగ్గఱినన్ బెగ్గడిలక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహంబువలని మోహసాలంబు నిష్కామకరవాలంబున నిర్మూలనంబు సేసి గేహంబు వెడలి పుణ్య తీర్థజలావగాహంబు సేయుచు నేకాంత శుచిప్రదేశంబున విధివత్ప్రకారంబునం గుశాజిన చేలంబులతోడం గల్పితాసనుండై మానసంబున నిఖిల జగత్పవిత్రీకరణ సమర్థంబై యకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబయిన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయంబుల వెంటనంటి పాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథియై మనోనామకంబు లైన పగ్గంబుల బిగ్గఁబట్టి మ్రొగ్గం దిగిచి దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టు మెట్టెడి మనంబును శేముషీ బలంబున నిరోధించి భగవదాకారంబు తోడ బంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదా ద్యవయవంబులం గ్రమంబున ధ్యానంబు సేయుచు రజస్తమోగుణంబులచేత నాక్షిప్తంబును విమూఢంబునగు చిత్తంబునం దద్గుణంబులవలన నయ్యెడి మలంబులం ధారణావశంబునం బోనడిచి నిర్మలచిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను ధారణానియమంబు గలుగ సుఖాత్మకం బగు విషయంబు నవలోకించు యోగికి భక్తిలక్షణంబైన యోగాశ్రయంబున వేగంబ మోక్షంబు సిద్ధించు ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

"ధారణ యే క్రియ నిలుచును?
ధారణకే రూప? మెద్ది ధారణ యనఁగా?
ధారణ పురుషు మనోమల
మేరీతి హరించు? నాకునెఱిఁగింపఁగదే."

అనిన విని రాజునకు నవధూత విభుం డిట్లనియె.

*వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీసలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబు లనియెడి సప్తావరణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మ హాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగం బులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాతలంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదం డంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రియంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రి యంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబుల నంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతివృషణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహంబులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారం బులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్తత్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వత ర్యుష్ట్రగ జంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు నమ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరులు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభిధానంబులును; ద్రవ్యంబులు హవిర్భాగంబులును; కర్మంబులు యజ్ఞప్రయోగంబులు నునగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయునని వక్కాణించి వెండియు నిట్లనియె.

హరిమయము విశ్వ మంతయు,
హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన; వింటే.

*కలలోన జీవుండు కౌతూహలంబునఁ;
బెక్కు దేహంబులఁ బేరువడసి
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు;
నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ;
డఖిల జీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు;
బద్ధుండు గాఁడు ప్రాభవము వలన

బహు వర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా
క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమోఘోల్లస
న్మహనీయోజ్వల బుద్ధియై భువననిర్మాణప్రభావంబుతో
విహరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై.

విను; మూఁఢుండు శబ్దమయవేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్చగించుచు మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాఁడు గలలుగను తెఱంగునం బరిభ్రమించుచు నిరవద్య సుఖలాభంబుం జెందఁడు; తన్నిమిత్తంబున విద్వాంసుండు నామ మాత్రసారంబు లగు భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు, నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖం బని నిశ్చయింపక యొండు మార్గంబున సిద్ధి గల దని చూచి పరిభ్రమణంబు సేయుచుండు.

కమనీయభూమిభాగములు లేకున్నవే;
పడియుండుటకు దూదిపణుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే;
భోజనభాజనపుంజ మేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే;
కట్ట దుకూల సంఘంబు లేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే;
ప్రాసాదసౌధాది పటల మేల?

ఫలరసాదులు గురియవే పాదపములు;
స్వాదుజలముల నుండవే సకల నదులు;
పొసఁగ బిక్షము వెట్టరే పుణ్యసతులు;
ధనమదాంధుల కొలువేల తాపసులకు?

రక్షకులు లేనివారల
రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షము బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్?

అని యిట్లు స్వతస్సిద్ధుండును, నాత్మయుఁ, బ్రియుండును, నిత్యుండును, సత్యుండును, భగవంతుండును నైన వాసుదేవుని భజించి తదీయ సేవానుభవానందంబున సంసార హేతువగు నవిద్యవలన బుద్ధిమంతుండు విడువబడుం గావున.

హరిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై చిక్కి వా
సరముల్ ద్రోసెడువాఁడు కింకరగదాసంతాడితోరస్కుఁడై
ధరణీశోత్తమ! దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వై
తరణీవహ్నిశిఖాపరంపరలచే దగ్ధుండు గాకుండునే?

మొత్తుదురు గదల, మంటల
కెత్తుదు రడ్డంబు, దేహమింతింతలుగా
నొత్తుదు, రసిపత్రికలను
హత్తుదురు కృతాంతభటులు హరివిరహితులన్.

మఱియు హరి చరణ కమలగంధ రసాస్వాదనం బెఱుంగని వారలు నిజకర్మబంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జాజ్వాల్యమాన వైతరణీ తరంగిణీ దహనదారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖిశిఖావగాహంబుల నొందుచుండుదురు; మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రసన్నులు మాయాపన్నులు గాక విన్నాణంబునం దమతమ హృదయాంతరాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజశుండాదండ సంకాశ దీర్ఘ చతుర్భాహుండును, కందర్పకోటి సమాన సుందరుండును, ధృతమందరుండును, రాకావిరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య సదనుండును, బ్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతిమానవిరాజిత పద్మరాగరత్న రాజీవి రాజమాన కిరీట కుండలుండును, శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును, రమణీయ కౌస్తుభరత్నఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతరపరిమళమిళిత వనమాలికాబంధురుండును నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖలాంగుళీయక విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబ మాన విమలస్నిగ్ధ నీలకుంచితకుంతలుండును, తరుణచంద్ర చంద్రికాధవళ మందహాసుండును, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగసంతతానుగ్రహలీలావిలాసుండును, మహాయోగిరాజ వికసిత హృదయకమలకర్ణికామధ్య సంస్థాపిత విలసిత చరణకిసలయుండును, సంతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాతసన్నిభుండును, విభుండునునైన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలిపికొని తదీయ గుల్ఫ చరణ జాను జంఘాద్యవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు నెంతకాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చలభక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతా తత్పరులై యుందురు.

ఆసన్నమరణార్థి యైన యతీశుండు;
కాల దేశములను గాచికొనఁడు
తనువు విసర్జించు తలఁపు జనించిన;
భద్రాసనస్థుఁడై ప్రాణపవను
మనసుచేత జయించి మానసవేగంబు;
బుద్ధిచే భంగించి బుద్ధిఁ దెచ్చి
క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞునాత్మలో;
పలఁ జేర్చి యాత్మను బ్రహ్మ మందు

గలిపి యొక్కటి గావించి గారవమున
శాంతితోడ నిరూఢుఁడై సకలకార్య
నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము
వలయు నని చూచు నటఁమీఁద వసుమతీశ!

మఱియునొక్క విశేషంబు గలదు; పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరంబున బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు; బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారు బ్రహ్మజీవిత కాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు; నారాయణచరణకమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులయి తేజరిల్లుదు; రీశ్వరాధిష్ఠితంబైన ప్రకృతియంశంబున మహత్తత్త్వం బగు; మహత్తత్త్వాంశంబున నహంకారంబగు; నహంకారాంశంబున శబ్దతన్మాత్రంబగు; శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు; గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు; స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు; సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు; రూపతన్మాత్రాంశంబు వలనఁ దేజంబగు; తేజోంశంబున రసతన్మాత్రంబగు; రసతన్మాత్రాంశంబు వలన జలంబగు; జలాంశంబున గంధతన్మాత్రంబగు; గంధతన్మాత్రాంశంబునఁ బృథివియగు; వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూపంబగు; నా రూపంబునకుఁ గోటి యోజన విశాలంబైన యండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వి యగు; దీనిఁ బంచాశత్కోటి విశాలంబని కొందఱు వలుకుదు; రయ్యావరణంబు మీఁద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు; నట్టి యేడింటిమీఁద బ్రకృత్యావరణంబు మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు సేయువాఁడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబునఁ బృథివ్యాత్మకత్వంబు నొంది యట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును, నతిక్రమించి భూతసూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుం డై యందు మనోమయంబును, దేవమయంబును నైన సాత్వికాహంకార గమనంబున మహత్తత్త్వంబు సొచ్చి గుణత్రయంబున లయించి ప్రధానంబు నొంది ప్రధానాత్మకత్వంబున దేహంబును నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాసి యానందమయుండై యానందంబునం బరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందుఁ గలయును.

పరమ భాగవతులు పాటించు పథ మిది
యీ పథమున యోగి యేఁగెనేని
మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు
కల్పశతము లైనఁ గౌరవేంద్ర!

*వినుము; నీ వడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపబడియె; వీనిం దొల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె; సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల; వందు భక్తిమార్గంబు కంటె సులభంబు లేదు.

విను మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు ద
ర్శన యజ్ఞత్వముతోడ నెంతయుఁ బరామర్శించి మోక్షంబు ద
క్కిన మార్గంబుల వెంట లే దనుచు భక్తిం జింత సేసెన్ జనా
ర్దను నాత్మాకృతి నిర్వికారుఁ డగుచుం దన్మార్గ నిర్ణేతయై.

అఖిల భూతములందు నాత్మరూపంబున;
నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు
బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును మ;
హత్సేవనీయుఁ డహర్నిశంబు
వందనీయుఁడు భక్త వత్సలుం డత్యంత;
నియతుఁడై సతతంబు నియతబుద్ధి
నాత్మరూపకుఁడగు హరికథామృతమును;
గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ

గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి
విష్ణుదేవుని చరణారవింద యుగము
కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!

మానుషజన్మము నొందిన
మానవులకు లభ్యమాన మరణులకు మహా
జ్ఞానులకుఁ జేయవలయు వి
ధానము నిగదింపఁ బడియె ధరణీనాథా!

*వినుము; బ్రహ్మవర్చసకాముడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవకామునకు నింద్రుండును, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యాదులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజాసాధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయు, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వనీదేవతలును, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్టాకామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును సంతానకామునకు బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూపదేవతలును, శత్రుమరణకామునకు గోణపాలకుం డైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును, భజనీయు లగుదురు; మఱియును.

కామింపకయును సర్వముఁ
గామించియునైన ముక్తిఁ గామించి తగన్
లో మించి పరమపురుషుని

నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా!
-----------------------------------------------------------------------------------------------
ఇదే భావం పురుష సూక్తం నుంచి విశ్వరూప సందర్శన యోగం వరకూ ఎన్నో చోట్ల కనబడుతుంది - ఇంకా అనుమానమా?భగవంతుడికి రూపం లేదు,ఉందని హిందూ పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు అని బూకరించేవాణ్ణి నిజంగానే చెప్పెట్టి కొట్టినా తప్పు లేదు!

*వీళ్ళు చెప్పేది చచ్చినా ఒప్పుకోకూడదన్న మొండితనం ఉంటే తప్ప దేవుడే పుట్టించినా దేవుడిలా కాకుండా జీవుడు మామూలుగా ఎందుకు ఉంటాడో,మరి దేవుడిలా కనిపించని ఈ జీవుడిలో ఆ దేవుడు ఉండటం ఎట్లా సాధ్యమో ఇంతకన్నా హేతుబద్ధంగా ఇంకెవరూ చెప్పలేరు!

*సద్యోముక్తి అంటే అప్పటికప్పుడు బంధాల నుంచి విముకతం అవటం - దీనినే పైన బహుకాలం జెవించి అవసాన కాలంలో ఏకనిష్ఠతో ఆరాధించి పొందదం గురించి చెప్పింది,క్రమమౌక్తి అంటే మనలాంటివాళ్ళం కుటుంబజీవనంలో ఉంటూనే మెల్లమెల్లగా సాధిస్తూ ఉండటం - ఇక్కదే మోక్షమార్గాలు చాలా ఉన్నాయి అంటున్న పాయింటు కూదా ఉంది.

*ఇక్కడ ఏమాత్రం డౌట్ లేకుండా ఏ కోరిక ఉన్నవాళ్ళు ఏవర్ని అర్చిస్తారో కోరికకీ దేవుడికీ లింకు పెట్టి గ్రోసరీ లిస్టు కన్నా దిట్టమైన లిస్టు కూడా ఇచ్చాడు - ఈ లిస్టులో లేని కోరిక ఏవరికన్నా ఉంటే వాళ్ళకోసం కొత్త దేవుణ్ణి కూడా పుట్టిస్తాం!
-----------------------------------------------------------------------------------------------
అసలు ముస్లిములు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూడటమే దేవుణ్ణి అవమానించటం అని వింతగా వాదిస్తున్నారు?

నా వ్యాఖ్యానంలో అస్పష్టత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అడగటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని ముస్లిములు చెప్తున్నారు!

దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

@author: భగవంతుడు పాంచభౌతికదేహం పొందలేదని గీత చెబుతుంది. ఇక్కడ సందేహం రావచ్చు. "నన్ను" అన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడని కొంతమందివాదన. ఒకవేళ శ్రీకృష్ణులవారే దేవుడనుకుంటే ఆయన పాంచభౌతిక దేహమును పొందలేదా? అని అడిగితే సమాధానం లేదు

haribabu:నీకు తెలియనిదల్లా లేనిదేనా?నీ విశ్లేషణకి అది పొసగదు,అంతే!దానిని కాదనగలిగిన పాండిత్యం నీకు లేదు - అది నిజం!

దేవుడే నేను చేప్పేది విను అంటుంటే ఇంకా కాదు ఎక్కడో ఉన్నవాడి గురించి చెప్తున్నాడు అంటారేంటి?శిల్పాగమ శాస్త్రం అనేదాన్ని కూదా శిల్ప ఆగమన శాస్త్రం అని అంటున్న మీకు, సంస్కృతంలో ఓ అంటే ఢం రాని మీకు వైదిక సాహిత్యాన్ని అర్ధం చసుకోగలనన్న అహంకారం దేనికి?మీరు ముస్లిం అని మాకు తెలుసు! అసలు మీ మతం గురించి "మా మతంలో ఈ మంచి ఉంది" అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేసుకోకుండా హిందూమతంలో విగ్రహారాధన లేదు/ హిందూమతంలో బహుదేవతారాధన లేదు/హిందూమతలో కూదా ఇస్లాం మతం ఉంది అని నిరూపించాలన్న నెగిటివ్ ప్రచారపు దురద ఎందుకు?

@ABHILASH:ఇక ముస్లిం వర్గంలో ఉన్న నిమ్న-ఉన్నత కుల తత్వం గురించి ఏమంటారు? అన్న మీ ప్రశ్న కూడా సరైనదే. దానికి రెండు కారణాలు: ఒకటి- సామాజిక ప్రభావం. రెండవది- ఇస్లామీయ శాస్త్రాలైన ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ప్రబోధనల జ్ఞానం లేకపోవటం.

haribabu:రెండవ కారణంగా మీరు చెప్పిన ఇస్లామిక్ శాస్త్రజ్ఞానం లేకపోవటం అన్నదాన్ని మీరు తొలగించలేకపోతున్నారు గనకనే అది ముస్లిములలో ఇంకా ఉంది - అవునా కాదా?
గురివింద తన నలుపు ఎరగదన్నట్టు మరి హిందువుల గురించి మీరు ఇంత భీకరంగా ఎందుకు రెచ్చిపోయినట్టు? వేరే మతంలో ఒక తప్పును పట్టేముందు మీ సొంత మతంలో అది ఉందా లేదా అని చూసుకుని అదే లోపం మీలోనూ ఉంది గనక ప్రస్తుతానికి నోరు మూసుకుని ఉంటే బాగుండేది కదా!
హిందువులు అంత లోకువైపోయారా? ఇప్పుడు మీరు చేయాల్సింది కంటితుడుపు సమర్ధనలు కాదు, ముందు మీ నలుపుని కడుక్కోవటానికి ఎంత టైము పడుతుందో ఒక నిక్కచ్చి తేదీ చెప్పి ఆ తర్వాతనే, అంటే మీలో ఆ లోపం పూర్తిగా పోయిందని సాక్ష్యం చూపించి అప్పుడు హిందువుల్లో ఉన్న తప్పుల్ని గురించి మాట్లాడండి - ఖబడ్దార్!

పదే పదే హిందూమతాన్ని కెలికేది వాడు!వొద్దంటే మనకి చాందసాన్ని అంటగడతాడు - తంతే ఏడుస్తాడు!!

Wednesday, 12 October 2016

ఇదే నా మొదటి యాండ్రాయిడ్ యాప్!పోయి పోయి తెలుగు పంచాగం మీద పడ్డాను - ఎలా ఉంది?

     నేను గతంలో సూచనగా చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు!ఇప్పటికి అప్లికేషన్ పూర్తిచేసి లైవ్లో ఉంచగలిగాము.ఇది మన సంప్రదాయకమైన తెలుగు పంచాంగం మీద ఆధారపడింది - వంగిపురపు వారి వెర్షన్ చూపిస్తున్నాం ఇందులో.

     ఇవ్వాళ మనం ఉన్న కాలం చాలా భిన్నమైనది.ఒకే ఒక ఉదాహరణ:మామూలుగా రోజువారీ పనుల్లో ఇంగ్లీషువాళ్ళు అలవాటు చేసిన గ్రెగేరియన్ క్యాలెందరు వాడుతున్నాం,కానీ మన పండగలు ఎప్పుడొస్తాయో తెలుసుకోవాలనుకున్న చిన్న చిన్న విషయాలకీ ఏదైనా ముఖ్యమైన పని శుభప్రదంగా జరగాలంటే ఎప్పుడు మొదలుపెట్టాలి అనే పెద్ద పెద్ద విషయాలకి తప్పనిసరిగా పంచాంగమే చూడాలి.ఈ రెంటికీ చాలా చాలా తేడాలు ఉన్నాయి.ఇంగ్లీషువాళ్లకి సంవత్సరం ఒక అంకె మాత్రమే,నెల అంటే ఏదో ఒక పేరు మాత్రమే,మళ్ళీ తేదీ కూడా ఒక సంఖ్య మాత్రమే.ఇక కాలం విషయానికి వస్తే గంటలు,నిమొషాలు,సెకండ్లు - అంతే!మనకి అట్లా కాదు,ప్రతి సూక్ష్మమైన వివరానికీ ఎంతో ప్రత్యేకత ఇచ్చిన ఒక సంక్లిష్టమైన కాలగణనశాస్త్రం ఉంది ఇక్కడ!మీరు మరీ గందరగోళం పడిపోతారని ఎక్కువగా చెప్పను గానీ భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం, కాలస్వరూపం, వాస్తు, జ్యోతిషం  - ఇవన్నీ వేరువేరు కాదు మనవాళ్ళకి!మన పండగలనే తీసుకోండి - ప్రతి పండుగా ఏదో ఒక ఋతువుకీ కాలానికీ మొదలో చివరో వస్తూ గట్టిగా కలిసిపోయి ఉంటుంది.గ్రహతారకాదుల చలనాన్ని బట్టి నిర్ణయించిన కాలప్రమాణాలు మనవి.మన కుర్రాళ్ళు హాప్పీ హాప్పీ న్యూ యియర్ పేరుతో డిసెంబర్ 31 కీ జనవరి 1కీ మధ్యన తాగి తాగి తందనాలాడుతూ వెర్రెత్తి పోవడానికి కేవలం తేదీ మారటం తప్ప ఇతర ప్రాముఖ్యత ఏమైనా ఉందా?లేదు గాక లేదు!కానీ చైత్ర మాసారంభపు ఉగాది అట్లా కాదు,అప్పటి తారాలోకపు విశేషాల దగ్గిర్నుంచీ భూమి మీద వాతావరణంలో జరిగే మార్పుల వరకూ ప్రతిదీ విశేషమే,అయినా ఉత్సాహం ఉండటం లేదు!

     హిందువైన ప్రతి వ్యక్తికీ పంచాంగం అవసరమే,కానీ మొత్తం పంచాంగ గణితమంతా తెలుసుకోనక్కర లేదు - సిద్ధాంతులు వ్రాసి ఇచ్చిన పంచాంగం చూసుకుంటే చాలు.మళ్ళీ ఇక్కడ అవన్నీ గ్రిగేరియన్ క్యాలెండరు సాయంతో చెబితేనే అర్ధం అయ్యే పరిస్థితి ఉంది.అదీ సిద్ధాంతులే చేసారు - బేసిక్స్ తెలుసుకుని ఆ క్యాలెందరు చూస్తే సరిపోతుంది.కానీ ఎంత ఆసక్తి ఉన్న వ్యక్తి అయినా ప్రతిచోటుకీ పంచాగం మొత్తాన్ని తీసుకుపోలేడు గదా!ఆ సులువునే ఈ అప్లికేషను మీకు ఇస్తుంది.పంచాగంలో ఉండే మొత్తం సమాచారాన్ని ఒకేచోట ఇరికించకుండా విడగొట్టి వేర్వేరు చోట్ల చూపించడం మిగతావాటికన్నా "శ్రీకృష్ణ తెలుగు క్యాలెంరు"కి ఉన్న ప్రత్యేకత. 

     మీరు పైన ఉన్న యాప్ పేరుగా ఉన్న లింకును క్లిక్ చేస్తే గూగుల్ ప్లేస్టోర్ మీకు యాప్ వివరాలను చూపిస్తుంది.ఇన్స్టాల్ చేసుకున్నాక ఐకాన్ మీద నొక్కితే మొదట బటన్లతో నిండిన మెయిన్ మెను కనబడుతుంది.
     ఇందులో పైవరసలో ఉన్న మూడు బటన్లూ క్యాలండరుకు సంబంధించినవే!మొదటిది ఆ బటన్ మీద ఉన్న బొమ్మ చూపిస్తున్నట్టు ఆ నెలమొత్తాన్ని చూపిస్తుంది.మామూలుగానే అన్ని డైనమిక్ క్యాలెందర్ల మాదిరే ఆరోజుని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది.ముఖ్యమైన శెలవుల్నీ చూపిస్తుంది.దిగువన ఆ నేలలోని పండుగల్నీ ప్రతయేకమైన రోజుల్నీ చూపిస్తుంది.
     చూశారుగా,పైన గ్రెగరియన్ క్యాలెండర్ నెల దాని కింద త్గెలుగు నెల పేరు ఉంది కదా.దానికి అటూ ఇటూ మామూలుగా అన్ని అప్లికేషన్లన్లో ఉండే prev మరియు next బటన్లు.పసుపురంగులో మొత్తం నెలలోని అన్ని తేదీలూ ఉన్నాయి.మీరు ఏరోజున ఓపెన్ చేస్తే ఆరోజు నీలం రంగులో కనిపిస్తుంది.ప్రత్యేకమైన రోజులు జేగురు రంగులో కనిపిస్తున్నాయి.ఇంక ఆరోజుకి సంబంధించిన తిధి,వార,అనక్షత్ర వివరాలు రెండు బ్లాకులుగా విదగొట్టి ఎడమవైపున వారం, దానిమీద ఆధారపడిన రాహుకాలం, యమగందం, దుర్ముహూర్తం చూపిస్తూ కుడివైపున తేదీనీ దానిమీద ఆధారపడిన మాసం, తిధి, నక్షత్రం, వర్జ్యం చూపిస్తున్నాము.తిధి నక్షత్రాలు చూపించే బ్లాకులో కుడి పక్కన పైమూలలో కనిపిస్తున్న అంకె శాలివాహన సకపు ఆ మాసం యొక తేదీ. సాధారణంగా పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్య త్ర్వాత వచ్చే శుద్ధ పాడ్యమి నుంచి మొదలై నెల మధ్యలో పౌర్ణమి వచ్చేటట్టు ఉండి బహుళ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్యతో పూర్తి అవుతుంది.ఈ కాలనిర్ణయం శక సంవత్సరంతో కూడా పూర్తిగా కలిసి ఉందదు.అందుకని ప్రతి గ్రిగెరియన్ నెల మొదటి తేదీనా మరియు శక కాలమానంలో నెల మారి 1వ తేదీ వచ్చేటప్పుడూ శకమాసం పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రం బ్రాకెట్లో ఇచ్చాను.ఆ నెలలో వచ్చే పండుగలు చూడాలంటే స్క్రోల్ చేసి చూడాలి.పైన నెల పేరు ఉన్న నీలపు బార్ మీద టచ్ చేస్తే తెలుగు సంవత్సరమూ ఋతువుల వివరాలతో వేరే స్క్రీన్ కనబడుతుంది.మళ్ళీ ఆ స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా చాలు వెనకటి స్క్రీన్ వస్తుంది!

     ఇంక శుభసమయాలు క్లిక్ చేస్తే మొత్తం సంవత్సరంలో ఉన్న శుభసమ్యాల లిస్టు వస్తుంది - చాలా మామూలు స్క్రీన్!కాకపోతే, స్క్రీన్ మీరు క్లిక్ చెసినప్పటి రోజును హైలైట్ చేసి చూపిస్తుంది.అయితే, మొత్తం 365 రోజుల శుభాశుభాలనూ పైకీ కిందకీ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు.
     మాస ఫలితాలు అనెది రాశిని బట్టి చూస్తారు.ఇక్కడ పన్నెండు రాశులనీ చూపితూ ఏ రాశివారైనా తమ రాశిని క్లిక్ చేస్తే ఆ రాశివారికి ఆ మాసానికి సంబంధించిన మంచిచెడుల ఫలితం కనబడుతుంది.నెల మొదట్లో ఆ నెలకి సంబంధించిన వివరాలే కనబడినా 20వ తేదీ తర్వాత ఇప్పటి నెలకి మరియు వచ్చే నెలకి సంబంధించిన వివరాలు కూడా కనబడతాయి.
     క్యాలెండరుకి సంబంధించిన డాటా అంతా సిద్ధాంతిగారు ఇచ్చింది ఇచ్చినట్టు బ్లాకులుగా విడగొట్టి చూపించడం తప్ప నేను ప్రత్యేకించి కష్టపడి సొంతంగా చేసింది ఏమీ లేదు.కానీ దేవాలయాలు,పరిహారాలు,శుభాకాంక్షలు/సుభాషితాలు,సామెతలు అనే సెక్షన్ల మొత్తం కంటెంటు అంతా నేను తయారు చేసిందే. ఇంక మెయిన్ మెనులో రెండో వరస మొదటి బటన్ పూర్తిగా నా సొంతం!
     ఇది దేవాలయాలకి సంబంధించిన విభాగం.పంచాంగానికీ దేవాలయలకీ సంబంధం ఏమిటని మీకు సందేహం రావచ్చు,కానీ మొదటే చెప్పానుగా మన సంప్రదాయంలో అన్నిటికీ సంబంధం ఉంటుందని!ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు ఐన్స్టీన్ లాంటివాళ్ళు చెప్పడానికి చాలాముందుగానే స్థలానికీ కాలానికీ అభేదం చేప్పేశారు.కాలంలో కొన్ని తిధులు ఎలా ప్రత్యేకమైనవో కొన్ని స్థలాలకీ ప్రత్యేకతలు ఉన్నాయి.

     ఇక్కడ చూపించే దేవాలయాలని మూడు రకాల లిస్టులుగా విదగొట్టాను,పైన కనిపించే మూడు ట్యాబ్ బటన్లలో మొదట default listలో అన్ని ఆలయాలూ వస్తాయి,popular ట్యాబ్ నొక్కితే ఎక్కువ పాప్యులర్(మేము అనుకుని సర్వర్ డాటాబేస్ లిస్టుని మార్చినదాన్ని బట్టి) అయిన ఆలయాలు మాత్రం వస్తాయి.మూడో ట్యాబ్ బటన్ నొకితే మొదట శివుడు,విస్ణువు,సరస్వతి,శక్తి లాంటి మాస్టర్ లిస్టు వస్తుంది.వాటిలో ఒకదాన్ని క్లిక్ చస్తే ఆ క్యాటగిరెకి సంబంధించిన ఆలయాల లిస్టు వస్తుంది.అన్ని చోట్లా చివరి లెవెల్ మీరు ఆఖరున ఎంచుకున్న ఆలయానికి సంబంధించిన వివరాలతో టార్గెట్ స్క్రీన్ వస్తుంది.ఇక్కడ ఆలయం చరిత్ర,ఆలయ విశేషాలు,ప్రత్యేక పూజలు వంటివి వివరంగా చెప్పాను.దానికి తోడు ఆలయం ఎక్కడ ఉంది,ఎలా చేరుకోవాలి అనేది కూడా చెప్పాను.వచనం అందరికీ అర్ధమయ్యే శైలిలో చక్కని పదబంధాలతో ప్రవాహవేగంతో చదివించేలా,చదివిన కొద్దీ భక్తిభావం ఇనుమడించేలా ఉంటుంది!

     ఏ ఆలయానికి సంబంధించిన వివరం అయినా మీకు నచ్చితే లిస్టులో కుడిపక్కన ఉన్న లింకు దాన్ని షేర్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. మెయిన్ మెనులో తర్వాతి బటన్ పరిహారాలు అనేది కూడా ఒకవిధంగా ఆలయాలకి సంబంధించినదే.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,హిందువులకి కొన్నిసార్లు ప్రత్యేకమైన దోషపరిహారపూజలు చెయ్యాల్సి వస్తుంది - సర్పదోషం, గ్రహపీడ, వివాహప్రాప్తి, సంతానయోగం, ఐశ్వర్యప్రాప్తి, ఆయురారోగ్యం లాంటివి కొన్ని ఆలయాల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాంటి ఆలయాల్ని పరిహార పూజల ప్రకారం చూపిస్తున్నాము.బటన్ నొక్కితే మొదట ప్రత్యేకపూజ/పరిహారం పేర్లు వస్తాయి.వాటిలో ఒకదాన్ని క్లిక్ చేస్తే ఆ పూజల్ని ప్రత్యేకంగా జరిపించే ఆలయాల లిస్టు వస్తుంది.ఉదాహరణకి కాలసర్ప దోషం/రాహుకేతు గ్రహదోషం పూజలకి కాళహస్తి ప్రత్యేకం - ఇట్లా ఆసక్తిని బట్టి తెలుసుకోవచ్చు.

     మెయిన్ మెనులో తర్వాతి బటన్ శుభాకాంక్షలు/సుభాషితాలు మెను అనేది కేవలం వాటిని చూసి సరిపెట్టుకోవటానికి కాకుండా వాటిని మీరు మీ స్నేహితుల్లో ఎవరికయినా సందేశాలుగా పంపించుకునే వీలు కూడా ఉంది.
     లోపలికి వెళ్ళాక కుడివైపున ఉన్న బటన్ నొక్కి మీ స్నేహితులకి సందేశం పంపించవచ్చు.అది వారికి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది.మెయిన్ మెనులో తర్వాతి బటన్ సామెతలు కూడా దాదాపు ఇలాంటిదే.ఇక్కడ ఒక్కొక్క సామెతనీ వూరికే చూపించి వొదిలెయ్యకుండా,అర్ధం వివరించి,ఎక్కడ ఎట్లా ఉపయోగిస్తే బాగుంటుందో సూచన/ఉదాహరణ కూడా ఇచ్చాను.
     ఇంక మెయిన్ మెనులో తర్వాత వచ్చే చేయవలసినవి మరియు జ్ఞాపికలు అనే రెండు మెనూలు ఈ యాప్ ద్వారా మీరు రిమైండర్స్ తయారు చేసుకోవటానికి పనికి వస్తాయి.అవన్నీ లోపల వెబ్ డాటా ఇన్పుట్ ఫారంస్ మాదిరిగానే ఉంటాయి.మిగిలిన రెందు మెనూలు ఈ యాప్ మీకు నచ్చితే సోషల్ మీడియా ద్వారా ఇతర్లకి దీని గురించి చెప్పటం కోసం పెట్టినవి.

     ఇంతకన్నా ఎక్కువగా చెబితే బోరు కొడుతుంది.ఏ అప్లికేషన్ అయినా అతిగా వ్యాఖ్యానించి చెప్పకుండా ఉపయోగించే వ్యక్తి తనంతట తను తెలిసుకోగలిగితేనే అది మంచి అప్లికేషన్ అవుతుంది.చూడగానే అర్ధం అయ్యి ఉపయోగించుకోగలిగినప్పుడే తయారీదారు కొనుగోలుదారుడి అవసరాన్ని తీర్చగలిగినట్టు - ఒక కొనుగోలుదారుడిగా నేను కూడా అందుకు భిన్నం కాదు!ఆ లక్షణం ఇందులో ఉందనే విషయం మీద్వారా తెలిస్తే నాకు సంతోషం.లోపాలు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం,అయినా మీకు కనిపిస్తే చెప్పండి - వీలున్నంత తొందరగా వాటిని సరిచేస్తాం.ఏవైనా సామెతలు అందులో లేనివి,ఉంటే బాగుంటుందనిపించినవి మీరు ఉదహరిస్తే వాటినీ కలుపుతాం.సామెతల్ని నేను కేవలం లిస్టుగా ఇచ్చేసి వూరుకోలేదు,మొత్తం యాప్ హిందువుల జీవన విధానంలో అతి ముఖ్యమైన ఆలోచనా ధోరణిని తీర్చిదిద్దే అంశాలని క్రోడీకరించి చూపిస్తునాము కాబట్టి కంటెంట్ కేవలం నా స్వంతమే ఉండాలి అనే అహంకారం నాకు లేదు..శుభాకాంక్షలు/సుభాషితాలు విభాగంలో కూడా మీరు ఇచ్చిన సూచనల్ని తర్వాతి వెర్షన్లో చేర్చి యాప్ మరింత సమగ్రమైనదిగా ఉండేలా చూస్తాను.

మీ అరచేతిలో ఇమిడిపోయిన పంచాంగం ఈ శ్రీకృష్ణ తెలుగు క్యాలెండర్ యాప్!